రియాల్టీ షోల్లో బిగ్ బాస్‌కు ఉండే క్రేజే వేరు. అన్నీ షోలు వేరయా.. బిగ్ బాస్ వేరయా అన్న చందంగా ప్రేక్షకాదరణ పొందింది. వివిధ రకాల మనుషులు, వ్యక్తిత్వాలు, టాస్క్‌లు ఒక్కటేమిటి అన్ని రకాలుగా బిగ్‌బాస్ షో ఆకట్టుకుంటుంది. వారి మధ్య గొడవంట, వీరి మధ్య ప్రేమంట అంటూ పక్కింటావిడ చెప్పుకునే ముచ్చట్ల మాదిరిగా ఉండే ఈ గేమ్ షోకు విపరీతంగా హైప్ ఉంది. తెలుగులో బిగ్‌బాస్ ఇప్పటికే బుల్లితెరపై ఐదు సీజన్లు, ఓటీటీ వేదికగా ఓ సీజన్ ప్రసారమైంది. తాజాగా ఆరో సీజన్‌కు రంగం సిద్ధమైంది.బుల్లితెరపై మాత్రమే ప్రసారమయ్యే బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన లోగో వచ్చేసింది. లోగో చూస్తుంటే ఎంతో క్రియేటివిటీగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. ఈ సీజన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే వివరాలు బిగ్‌బాస్ నిర్వాహకులు ఇంకా తెలియపరచలేదు. అయితే ఎక్కువ కాలం వెయిట్ చేయించకుండా త్వరలోనే దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
