మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ లేని చెత్త అంతా ఇక్కడే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.ముఖ్యంగా మీడియా సంస్థలు అయితే మరీ దారుణంగా తయారయ్యాయి.దీనితో పలు మీడియా ఛానెల్స్ నే రాష్ట్రంలో బ్యాన్ చేయించుకునే స్థాయికి దిగజారాయి.అలాగే అదే మీడియా ఛానెల్స్ కు ఉన్న పత్రికలూ అంతే ఆవు ఎక్కడో మేస్తే దూడ ఇంకెక్కడో మేస్తుందా అన్నట్టుగా ఛానెల్స్ ఏం చూపిస్తారో దానికి మరింత మసాలా దట్టించి విషపూరిత వార్తలను మన పత్రికల వారు ముద్రిస్తారు.
అలా వైసీపీ అధినేత మరియు ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ పై జరిగిన జరుగుతున్న అసత్య ప్రచారాన్ని బీజేపీ కీలక నేత అయినటువంటి జీవిఎల్ నరసింహా రావు తిప్పి కొట్టారు.జగన్ మోడీ దగ్గరకు వచ్చిన ప్రతీసారీ జగన్ కు అక్షింతలు పడుతున్నాయని మోడీ జగన్ పాలనపై సీరియస్ గా ఉన్నారని బాబు అను’కుల’ పత్రికల్లో ఇష్టమొచ్చినట్టు రాసుకున్నారు.అలాంటి వారికి జీవీఎల్ షాకిచ్చారు.అక్కడ మోడీకు జగన్ మధ్య ఏం జరిగింది అన్నది అక్కడే చాలా మందికి తెలీదని కానీ వీళ్లకు ఎలా తెలిసిపోయి ఉంటుంది అని చాలా గోప్యంగా ఉండే ఇలాంటి విషయాలను ఇష్టమొచ్చినట్టు కావాలని జనాల్లోకి తమ పత్రికల ద్వారా రాసి ప్రచారం చేస్తూ ఎక్కిస్తున్నారని ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని తేల్చి చెప్పేసారు.