బన్నీపై హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్

బన్నీపై హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీలో ఎంత స్టార్‌డం ఉన్నా అందరు హీరోలు డ్యా్న్స్‌లు ఇరగదీయలేరు. కొరియోగ్రాఫర్ చెప్పినట్లు డ్యా్న్స్ చేసే హీరోలు వేరు, నరనరాల్లో జీర్ణించుకుపోయినట్లు డ్యాన్స్ చేసే హీరోలు వేరు. అలాంటివారిలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ఎప్పుడూ ముందుంటారు. అయితే బన్నీ డ్యాన్స్ చేసే విధానానికి హృతిక్ కూడా ఫిదా అయిపోయారు. నిన్న హృతిక్ ఏదో పని మీద చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా దక్షిణాది సినిమాలు, ఇక్కడి స్టార్ సెలబ్రిటీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

” నేను ఇప్పటివరకు ఏ దక్షిణాది సినిమాను చూడలేదు. కానీ ఇక్కడి సినిమాల్లో ఆర్టిస్టిక్ టెక్నికాలిటీస్ అంటే చాలా ఇష్టం. సౌత్ సినిమాల నుంచి ఈ విషయాన్ని బాలీవుడ్ నేర్చుకోవచ్చు. అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే నాకూ ఇష్టమే. చాలా ఎనర్జిటిక్‌గా, స్ట్రాంగ్‌గా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. విజయ్ డ్యాన్స్‌ కూడా బాగుంటుంది. అసలు ఏం తింటారయ్యా వీళ్లు. డ్యాన్స్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ లెవల్ అద్భుతంగా ఉంటుంది’ అని వెల్లడించారు హృతిక్.