41 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతున్న హీరోయిన్..

బాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగులో ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, గోపి గోడమీద పిల్లి వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విశారదన్ బీడస్సిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. ఆ తర్వాత పూర్తిగా కుటుంబ బాధ్యతలు తీసుకుని సినిమాలకు దూరమైంది.

తాజాగా, ఈ అమ్మడు 41 ఏళ్ల వయసులో తాను ప్రెగ్నెంట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బేబీ బంప్ వీడియోను షేర్ చేసింది. నా జీవితంలో అత్యంత అందమైన నిజ జీవిత పాత్రను సృష్టించడం, పెంపొందించడం, పరిణామం చెందడంపై దృష్టి సారించి ఉత్తమ నెలలను ఆస్వాదిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు.