నితేశ్ తివారీ రామాయణంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు….

బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ రూపొందించనున్న రామాయణంపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు భారీ తారాగణంతో రూపొందించనున్నారని కొన్నాళ్లుగా టాక్ వినిపిస్తుంది. ఇతిహాసలలో ఒకటైన రామాయణం ఆధారంగా ఇదీ తెరకెక్కినుంది. ఇందులో శ్రీ రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి నటించనున్నారు. అలాగే రావణుడిగా కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ నటిస్తారని , ఆంజనేయుడి గా బీటౌన్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో రకుల్ శుర్పణఖగా కనిపించనుందాని టాక్ వినిపిస్తుంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ అదేంటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషించనున్నారనే టాక్. శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు పాత్రను అమితాబ్ పోషించనున్నారని సమాచారం. ఈ విషయంపై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గతంలో బ్రహ్మాస్త్ర చిత్రంలో రణ్‍బీర్, అమితాబ్ కలిసి నటించారు. ఇప్పుడు రామాయణంలో మరోసారి కలిసి కనిపించనున్నారు.

అలాగే రామాయణం మూవీలో కైకేయి పాత్రలో లారా దత్తా, కుంభకర్ణుడిగా బాబీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ డీటేయిల్స్ మాత్రం తెలియరాలేదు.ఈ ఏడాది మార్చిలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఇటీవలే యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు రణబీర్ కపూర్. అలాగే ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ లో నటిస్తుంది. ఈ మూవీ పూర్తయ్యాక రామాయణం షూటింగ్ స్టార్ట్ కానుంది. అలాగే అమితాబ్ కల్కి 2898 ఏడీలో నటిస్తున్నారు. మొత్తానికి భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామయాణం మూవీని రూపొందించనున్నారు.