ఉమా Vs దేవినేని.. బెజవాడ మార్క్ రాజకీయం!

ఉమా Vs దేవినేని.. బెజవాడ మార్క్ రాజకీయం!

రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల పింఛన్లు తొలగించారని టీడీపీ ఆరోపిస్తోంది.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడుతోంది. బొండా ఉమా కూడా విజయవాడ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలతో పాటూ పింఛన్లు తొలగించారని చెబుతున్న కొందరు బాధితుల్ని తీసుకొచ్చారు. పింఛన్‌పై ఆధారపడి బతుకున్నవారిని ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

ఇటు బొండా ఉమాకు కౌంటర్‌గా వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ కూడా భారీ ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని.. ర్యాలీ తర్వాత ఓ సభ ఏర్పాటు చేశారు. పింఛన్లు తీసుకుంటున్న వారితో సభలో మాట్లాడించారు. ఈ ర్యాలీకి వైఎస్సార్‌సీపీ నేతలు భారీగా తరలివచ్చారు. ఈ రెండు పార్టీల పోటా-పోటీ ధర్నాలతో విజయవాడ హోరెత్తింది.