లైగర్‌ మూవీకి బాయ్ కాట్‌ సెగ

సోషల్‌ మీడియాలో ఆర్‌ఎస్‌ఎస్‌ మూకలు ‘బాయ్ కాట్‌ లాల్‌సింగ్‌ చడ్డా’ ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ చేయడంతో… ఆ మూవీ విజయం సాధించలేకపోయింది. అయితే సోషల్‌మీడియాలో అమీర్‌కి కొంతమంది నెటిజన్లు మద్దతు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే బాయ్ కాట్‌ ప్రచారం కావడంతో.. అమీర్‌ ఆర్థికంగా నష్టపోయాడు. లాల్‌సింగ్‌ చడ్డా మూవీతో మొదలైన  బాయ్ కాట్‌ సెగ.. ఆ తర్వాత రిలీజ్‌ అయ్యే సినిమాలకూ తగులుతుంది. తాజాగా సోషల్‌ మీడియాలో ‘లైగర్‌’ మూవీకి  బాయ్ కాట్‌  ట్యాగ్‌లైన్‌ ట్రెండ్‌ అవుతుంది. అయితే కొంతమంది నెటిజన్లు విజయ్ కి సపోర్టుగా నిలుస్తున్నారు. సినీ ఇండిస్టీలో ఎవరి సపోర్టు లేకుండానే విజయ్ ఈ స్థాయికి వచ్చారని తనకి మద్దతిస్తున్నారు.
కాగా, ఆగస్టు 25న లైగర్‌ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో సినీ ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. ఇందులో భాగంగా.. విజయ్ శుక్రవారం బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన్ని  బాయ్ కాట్‌ ట్రెండ్‌పై స్పందించాలని కోరగా.. ‘ఒక సినిమా ద్వారా కొన్ని వేలమందికి జీవనోపాధి లభిస్తుంది.