మమతా బెనర్జీకి 5 లక్షల జరిమానా

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు రూ. 5 లక్షల జరిమానా విధించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలో తాను పోటీ చేసిన నందిగ్రామ్‌లో ఓడిపోవడాన్ని కోర్టులో మమతా సవాలు చేయగా…దీన్ని హైకోర్టు న్యాయమూర్తి కౌశిక్‌ చందా విచారిస్తున్నారు. ఆయనకు బిజెపితో సంబంధాలున్నాయని, విచారణను మరో బెంచ్‌కు అప్పగించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం దురుద్దేశాలు ఆపాదించారంటూ మమతకు జరిమానా విధించింది. అదేవిధంగా మమతా దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్‌ కౌషిక్‌ చందా స్వయంగా తిరస్కరించారు. ఈ కేసును తన వ్యక్తిగత అభిష్టానుసారం విచారించకూడదని నిర్ణయించుకున్నారు. కేసును విచారించే బెంచ్‌ నుంచి తప్పుకున్నారు.