Cinema

ఆగస్టు నుంచి సినిమా థియేటర్లు ప్రారంభం?

ఆగస్టు నుంచి సినిమా థియేటర్లు ప్రారంభం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు బంద్‌ అయిన విషయం తెలిసిందే. వాటిని వచ్చే నెలలో మళ్లీ తెరవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. ఆ శాఖ కార్యదర్శి అమిత్‌ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ విషయంపై తుది నిర్ణయాన్ని త్వరలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజరు భల్లా తీసుకుంటారని చెప్పారు. కరోనా కట్టడి జాగ్రత్తలో భాగంగా సీట్ల మధ్య ఖాళీ ఉంచి ...

Read More »

మెగా డాటర్‌ టీమ్‌కి కరోనా పాజిటివ్‌

మెగా ఫ్యామిలీ నుంచి చిరు పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌’ పేరుతో ఓ నూతన నిర్మాణ సంస్థని స్థాపించిన సుస్మిత ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మాణం కూడా ఇటీవలే మొదలుపెట్టారు కూడా. ఈ వెబ్‌ సిరీస్‌కి ‘ఓరు’ ఫేమ్‌ ఆనంద్‌ రంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా, ...

Read More »

నితిన్‌ పెళ్ళిలో పవన్ కళ్యాణ్

హీరో నితిన్‌, షాలిని వివాహ వేడుక జూలై 26 రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారు. అయితే శుక్రవారం నితిన్‌ పెళ్లికొడుకు ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు నితిన్‌ ఎంతో అభిమానించే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇంకా హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మాత చినబాబుతో పాటు మరికొందరు హాజరైయ్యారు. అయితే నితిన్‌ పెళ్లి వేడుకకు పవన్‌ హాజరవ్వడం లేదని, ...

Read More »

ఆ ప్రేమ లేఖను భద్రంగా దాచుకున్నా : కీర్తి సరేష్‌

తన నటన, అభినయం, చిరునవ్వుతో కుర్రాళ్లను అమితంగా ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్‌ సౌత్‌ ఇండిస్టీలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది. కీర్తి సురేష్‌ కాంట్రవర్సీలకు చాలా దూరంగానే ఉంటుంది. కేవలం తన సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ పైనే ఎక్కువ దష్టి పెడుతోంది. దాదాపు సౌత్‌ ఇండిస్టీలో ఆమె స్టార్‌ హీరోలందరితో వర్క్‌ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. కొన్ని ఇంటర్వ్యూలలో కీర్తి సురేష్‌ తనకు వచ్చిన ఒక ప్రపోజల్‌పై చాలా క్యూట్‌గా వివరణ ఇచ్చింది. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా లవ్‌ లెటర్స్‌ వచ్చింది లేదట. ...

Read More »

ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ కూడా రాకపోవచ్చు..

ఎన్టీఆర్‌ అభిమానులకు ఈ ఏడాది తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అరవింద సమేత తర్వాత గ్యాప్‌ తీసుకొని రాజమౌళి డైరెక్షన్లో మల్టీస్టారర్‌ చిత్రానికి ఓకే చెప్పడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ ఈ సినిమా మొదలైనప్పటి నుండి అనేక అవాంతరాలు ఎదురువుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్‌ ఆలస్యం కావడం, అన్ని సెట్‌ అయ్యాయి అనుకునేలోపు కరోనా రావడంతో ఈ సినిమా ఈ ఏడాదిలో సెట్స్‌పైకి వస్తుందో.. రాదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్టీఆర్‌ ఫస్ట్‌ లుక్‌ ఇప్పట్లో రావడం కష్టమే అనిపిస్తుంది. ఎన్టీఆర్‌ ...

Read More »

యుద్ధ వీరుడిగా ప్రభాస్‌?

మహానటి ఫేం డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌తో ప్రభాస్‌ తన 21వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవల దర్శకుడు నాగ్‌ ఈ సినిమా పాన్‌ ఇండియాకు మించిన పాన్‌ వరల్డ్‌ మూవీ అని ప్రకటించడంతో ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌, హాలీవుడ్‌లో నటిస్తోన్న దీపిక పదుకొనెను ఈ చిత్రంలో హీరోయిన్‌గా తీసుకోవడంతో మరింత స్పష్టత వచ్చింది. కాగా ఈ మూవీ స్టోరీ లైన్‌పై ఓ క్రేజీ న్యూస్‌ బయటికి వచ్చింది. ప్రభాస్‌ 21 మూవీ కథ ఓ ఫిక్షనల్‌ వార్‌ ...

Read More »

ఎన్టీఆర్‌ దూకుడుకు ఇక బ్రేకులుండవ్‌..!

ఒకానొక దశలో ఇండిస్టీనే ఏలిన స్టార్‌ హీరోలకే పరాజయాలు తప్పలేదు. ఎంతటి స్టార్‌ హీరోకైనా ఏదో ఒక దశలో పరాజయాలు తప్పవు. ఈ కోవలోనే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కూడా కెరీర్‌లో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. బృందానం మూవీ తరువాత ఎన్టీఆర్‌ చేసిన శక్తి, ఊసరవెల్లి, దమ్ము చిత్రాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. దీనితో దూకుడు మూవీతో పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన శ్రీను వైట్లతో బాద్‌షా మూవీ చేశారు ఎన్టీఆర్‌. ఆ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకొని కొంచెం ఉపశనం కలిగించింది. ...

Read More »

కంగనా రనౌత్‌కు మద్దతుగా నిలిచిన క్రికెటర్‌..

 బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్‌ మతితో బంధుప్రీతి (నెపోటిజం) అంశం మరోసారి చర్చకు దారితీసింది. ఇండిస్టీలోని నెపోటిజం కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ బాలీవుడ్‌లోని కొందరు పెద్దలను పరోక్షంగా విమర్శించించారు. కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలను పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఖండిస్తుండగా.. మరికొందరు ఆమెకు మద్దతునిస్తున్నారు. తాజాగా టీమిండియా బ్యాట్స్‌మన్‌ మనోజ్‌ తివారి కూడా ఆమెకు ట్విటర్‌ వేదికగా మద్దతు పలికారు. ‘భారతదేశం సుశాంత్‌ మతికి కారణం ...

Read More »

ముఖ్యమంత్రిగా అల్లు అర్జున్‌ మెప్పించగలడా?

ఎపి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఆధారంగా చేసుకొని ‘యాత్ర’ అనే టైటిల్‌తో సినిమా తీసిన దర్శకుడు మహి వి రాఘవ్‌ గుర్తుందా? గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు పొలిటికల్‌ నేపథ్యంలో వచ్చిన యాత్రతో సినిమా రాజశేఖర్‌ రెడ్డి అభిమానులు, తెలుగు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్నారు. అయితే రాఘవ్‌ మరోసారి పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలోనే సినిమా తీయబోతున్నాడట! అల్లు అర్జున్‌ తన తరువాత ప్రాజెక్ట్‌ రాఘవ్‌ దర్శకత్వంలో చేయబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు ...

Read More »

సూపర్‌ స్టార్లతో కీర్తి సురేష్‌ బిజీబిజీ

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే కీర్తి సురేష్‌ సౌత్‌ లోని దాదాపు స్టార్‌ హీరోల అందరితో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది. తెలుగు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో, తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌తో ప్రస్తుతం నటిస్తున్న కీర్తి సురేష్‌ త్వరలో మరో సూపర్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌తో కూడా నటించేందుకు ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కమల్‌ హాసన్‌ హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో ‘వెట్టయ్యాడు విల్కెయ్యాడు’ చిత్రంకు సీక్వెల్‌ రాబోతుంది. తెలుగులో రాఘవన్‌గా విడుదలైన ...

Read More »