Cinema

‘పుష్ప’ ఇంకాస్త ఆలస్యం చేస్తాడట!

‘అలా వైకుంఠపురం’తో హిట్‌ కొట్టిన అల్లు అర్జున్‌… ఆ సినిమా తర్వాత వెంటనే ‘పుష్ప’ సినిమా చేయాలని భావించినప్పటికీ… కరోనా కారణంగా సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ‘పుష్ప’ చిత్ర బృందం కూడా షూటింగ్‌కి సిద్ధమైంది. అడవి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలను వికారాబాద్‌ అడవుల్లో షూట్‌ చేయాలని మొదట భావించారు. అయితే, ఏకంగా అడవి సెట్‌ వేయబోతున్నట్లుగా కూడా వార్తలచ్చాయి. చివరకు కేరళ అడవుల్లోనే ఈ నెలలో షూటింగ్‌ ప్రారంభించనున్నారని, ఇంకే కారణం చేతనూ షూటింగ్‌ ఆగదని యూనిట్‌ సభ్యులు తెలిపారు. ...

Read More »

రూటు మార్చిన అనుష్క..

మన హీరోల పట్టుదల చూస్తుంటే ఇప్పుడు కాకున్న తర్వాత అయినా అక్కడ, ఇక్కడ సూపర్‌ హిట్‌లు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్‌టిఆర్‌-రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, అల్లు అర్జున్‌ ‘పుష్ఫ’, విజరు దేవరకొండ ‘ఫైటర్‌’ చిత్రాలను పాన్‌ ఇండియా మూవీలుగా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు అనుష్క కూడా పాన్‌ ఇండియా స్టార్‌డమ్‌ కోసం ప్రయత్నాలు చేస్తోంది. బాహుబలి సినిమాతో ఇప్పటికే ఇండియా వైడ్‌గా ఈమెకు గుర్తింపు దక్కింది. అయితే ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను అనుష్క సరిగా వినియోగించుకోలేకపోయింది. ఇప్పటికైనా ఆ క్రేజ్‌ను క్యాష్‌ ...

Read More »

దివ్యాంగుల డ్యాన్స్‌ టాలెంట్‌ షో కోసం చరణ్‌ స్పెషల్‌ వీడియో…!

రామ్‌చరణ్‌ దివ్యాంగుల టాలెంట్‌ని వెలికితీసి ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ‘హీల్‌ యువర్‌ లైఫ్‌ త్రూ డ్యాన్స్‌’ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఓ వీడియో ద్వారా తెలిపారు. ఈ ఆన్‌లైన్‌ టాలెంట్‌ షోకు రామ్‌చరణ్‌ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. చరణ్‌తోపాటు ఈ షోలో కొరియోగ్రాఫర్స్‌ కమ్‌ డైరెక్టర్స్‌ ప్రభుదేవా, ఫరాఖాన్‌లు కూడా పాల్గనబోతున్నారు. తనకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టమని, అందుకే యునిక్‌ డ్యాన్స్‌ టాలెంట్‌ షోని చేస్తున్నానని రామ్‌చరణ్‌ చెప్పారు. ఈ షోలో పాల్గనాలంటే టాలెంట్‌ కలిగిన దివ్యాంగులందరూ urlife.co.in లో ఎంట్రీలను పొంది ...

Read More »

తమన్నాకు కరోనా పాజిటివ్‌

తమన్నా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నారు. షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన తమన్నా..హైఫీవర్‌ బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరగా…అనంతరం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా, ఆ మధ్యన తమన్నా తల్లిదండ్రులకు కరోనా సోకగా..కోలుకున్నారు. ప్రస్తుతం తమన్నా సత్యదేవ్‌తో కలిసి గుర్తుందా శీతాకాలం, అంధధూన్‌ రీమేక్‌లో టబు పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటు ఓ వెబ్‌సిరీస్‌ కూడా ఓకే చెప్పారు.

Read More »

పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మరో హీరో

నో పెళ్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి’ అంటూ కరోనా డేస్‌ లో పాడుకుంటూ వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ రూట్‌ మార్చాడని తెలుస్తోంది. ఇన్నాళ్లు ‘సోలో బతుకే సో బెటర్‌’ అని చెప్తూ వచ్చిన తేజ్‌ రీసెంట్‌ గా పెళ్ళికి గ్రీన్‌ సిగ్నల్‌  ఇచ్చాడని సినీ పరిశ్రమలో టాక్‌. ఇటీవల టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. దగ్గుబాటి రానా, నితిన్‌, నిఖిల్‌ సిద్ధార్థ్‌లు ఇప్పటికే ఓ ఇంటివారయ్యారు. అలాగే నాగేంద్రబాబు కూతురు నిహారిక కొణిదెల ...

Read More »

గోడౌన్‌లో బస్తాలకొద్ది కరెన్సీ నోట్లు.. భారీ స్కామ్! మోసగాళ్లకు అల్లు అర్జున్ సపోర్ట్..

గత కొంతకాలంగా పరాజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు.. భారీ స్కామ్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థ్రిల్ చేయబోతున్నారు. ‘మోసగాళ్లు’ పేరుతో విలక్షణ కథను రూపొందిస్తున్నారు. ఈ మూవీలో తానే హీరోగా నటిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు మంచు విష్ణు. చరిత్రలో అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ మిస్టరీని కథాంశంగా తీసుకొని హాలీవుడ్-ఇండియన్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్స్ మోసగాళ్లపై అంచనాలు నెలకొల్పగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేసి ఆ అంచనాలకు రెక్కలు ...

Read More »

‘నిశ్శబ్దం’ రివ్యూ

టాలీవుడ్‌లో లేడి ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి. భాగమతి తర్వాత ఈమె నటించిన మరో చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం క్రాస్‌ జోనర్‌ మూవీ. థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యే విషయంలో ఓ క్లారిటీ రాకపోవడంతో మేకర్స్‌ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేశారు. తెలుగులో నిశ్శబ్దం, తమిళ, మలయాళంలో సైలెన్స్‌ పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో నటించింది. ట్రైలర్‌తోనే ఓ హైప్‌ను క్రియేట్‌ చేయడంతో సినిమాపై ...

Read More »

డ్రగ్స్‌ కేసులో ముగ్గురు బడా హీరోలు.. వారి ఫోన్లపై ఎన్‌సిబి నిఘా

డ్రగ్స్‌ కేసులో ఇంతవరకు బాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు మాత్రమే వినిపించాయి.. కానీ బడా హీరోలుగా చెలామణీ అవుతున్న కొందరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. వారు డ్రగ్స్‌ వాడుతున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం.రియా చక్రవర్తి, దీపికా పదుకొణె, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌, తదితరులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) ఇప్పటికే విచారించింది. కొందరు హీరోయిన్ల మొబైల్‌ ఫోన్లలో గతంలో డిలీట్‌ అయిన డేటాను ఎన్‌సిబి తాజాగా పునరుద్ధరించింది. డ్రగ్స్‌ వినియోగానికి సంబంధించి ఇందులో కీలక వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా ...

Read More »

డ్రగ్ కేసులో బెయిల్ నిరాకరణ.. హైకోర్టుకు వెళ్తున్న హీరోయిన్లు

కన్నడ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్లు సంజన గల్రాని, రాగిణి ద్వివేది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సంజన, రాగిణికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్) కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరికొంత మంది బెయిల్ పిటిషన్లను ఈరోజు (సెప్టెంబర్ 30న) కోర్టు విచారించనుంది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివప్రకాష్, వినయ్ కుమార్‌ల యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. అలాగే, ఈవెంట్ ...

Read More »

ఆర్‌.ఆర్‌.ఆర్‌లో జూనియర్‌ భీమ్‌, సీతారామ్‌లుగా వీళ్లే !

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి తెరకెక్కించే సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉత్కంఠ నెలకొంటుంది. ప్రతీ చిత్రంలో ఏదో ఒక కొత్తదనంతో రాజమౌళి ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఎస్‌ఎస్‌.రాజమౌళి తెరకెక్కించనున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ (రౌద్రం.రణం.రుధిరం) సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ రాశారు. ఎంఎం.కీరవాణి బాణీలను జోడించారు. ఈ సినిమాలో అజరు దేవగణ్‌, శ్రియ అతిథి పాత్రల్లో కనిపించి సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది ...

Read More »