Cinema

డిగ్రీ అర్హత పరీక్ష రాసిన సినీ నటి హేమ

 సినీ నటి హేమ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విశ్వ విద్యాలయం డిగ్రీ అర్హత పరీక్ష ను రాశారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఈ అర్హత పరీక్ష రాశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం పది అధ్యయన కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 987 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 580 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలు వెంటనే ఆన్‌లైన్‌లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ధర్మానాయక్‌ తెలిపారు. అర్హత సాధించిన అ్యభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన ...

Read More »

బాలూకు ‘భారత్న రత్న’ కోరుతూ జగన్‌ లేఖ

ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. 4 దశాబ్దాల పాటు సినీ సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవకు గాను భారతరత్నతో సత్కరించాలని కోరారు. కాగా, కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మరణించిన సంగతి తెలిసిందే. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడటంతో పాటు తనదైన ముద్రతో ఆ పాటలకు ...

Read More »

గాన గంధర్వుడికి కన్నీటి వీడ్కోలు.. బాలు అంత్యక్రియలు పూర్తి

అశ్రు నయనాల మధ్య గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. చెన్నై శివారులోని ఫామ్‌ హౌస్‌లో అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అశ్రు నివాళులు అర్పించారు. బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు వెళ్లారు. తమ అభిమాన గాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. ఎపి ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ యాదవ్‌ హాజరై నివాళులు అర్పించారు. సినీ రంగం నుంచి విజరు, భారతీరాజా, దేవీశ్రీప్రసాద్‌, మనో, తదితరులు హాజరయ్యారు.

Read More »

బాలు కడసారి చూపుకు వస్తున్న ప్రముఖులు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాలు ను కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు చెన్నై శివారులోని తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. సినీ ప్రముఖులు భారతీరాజా, దేవిశ్రీ ప్రసాద్‌, సింగర్‌ మనో, తదితరులు బాలు భౌతికకాయాన్ని కడసారి చూసి కన్నీటి నివాళులర్పించారు. బాలు పార్థీవదేహాన్ని చూసిన మనో కన్నీటి పర్యంతమయ్యారు. భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించేందుకు తామరైపాక్కంలో 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ పోలీసులతో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నట్లు తిరువళ్లూరు ఎస్పీ ...

Read More »

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత

ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎస్పీ బాలు శుక్రవారం మరణించారని తెలిపారు డాక్టర్లు. కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్సపొందిన ఆయన ఆరోగ్యం గత కొంతకాలంగా నిలకడగా ఉంది. అయితే తాజాగా మరోసారి అస్వస్థతకు గురైన బాలసుబ్రహ్మణ్యం చివరికి ప్రాణాలు కోల్పోయారు. బాలసుబ్రహ్మణ్యం మరణవార్తను టాలీవుడ్ తో పాలు అన్ని సినీ ఇండస్ట్రీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన మృతిపట్ల సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. 1946 జూన్ 4న నెల్లూరులోని ...

Read More »

చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

ఈ ఏడాది సినీ ఇండీస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలు యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతున్నాయి. ఓ వైపు కరోనా విలయతాండవంలో చిక్కుకొని కొందరు తుదిశ్వాస విడవగా.. అనారోగ్య సమస్యలతో మరికొంతమంది నటీనటులు కన్నుమూయడం సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. రెండు రోజుల క్రితమే టాలీవుడ్ కమెడియన్ కోసూరి వేణుగోపాల్ కరోనాతో మరణించారు. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో కమెడియన్ మరణ వార్త వినాల్సి వచ్చింది. కన్నడ సినిమాలతో ఫేమ్ అయిన కమెడియన్ రాక్‌లైన్ సుధాకర్ (64) గుండెపోటుతో కన్నుమూశారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉండగా గుండెపోటు రావడంతో ...

Read More »

రేపు ఎన్‌సిబి ముందు హాజరౌతున్న రకుల్‌

డ్రగ్స్‌ కేసులో కలకలం రేపిన వారి పేర్లలో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరుంది. డ్రగ్స్‌ కేసు విచారణకు మూడు రోజుల్లో హాజరు కావాలని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) నోటీసులు జారీ చేసింది. అయితే నాకెలాంటి నోటీసులు అందలేదని రకుల్‌ ప్రీతిసింగ్‌ మాటమార్చడం గమనార్హం. రకుల్‌ వ్యాఖ్యలను ఎన్‌సిబి ఖండిస్తోంది. మేము వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించాం. చివరకు వాట్సాప్‌లో కూడా సమన్లు పంపాము. కానీ ఆమె స్పందించలేదు. రేపు కూడా ఆమె విచారణకు హాజరు కాకపోయినా.. ఏవైనా ...

Read More »

అంతర్జాతీయ చిత్రోత్సవం వాయిదా

గోవాలో నవంబర్‌ 20 నుంచి 28 వరకు జరగాల్సిన అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేశారు. ఈ 51వ చలనచిత్రోత్సవ సంబరాలు వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 24 వరకూ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని ఈసారి హైబ్రిడ్‌ ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఐబీ మంత్రిత్వశాఖ సూచనల మేరకు.. ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సమయంలో సినిమాలను అఫిషియల్‌ డిజిటల్‌ ఫార్మాట్‌లో రిలీజ్‌ చేస్తారు. డైరక్టరేట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, గోవా ఎంటర్‌టైన్మెంట్‌ సొసైటీ సంయుక్తంగా ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాయి.

Read More »

యువ హీరో ప్లాన్‌ భలే..

యువ హీరో కార్తికేయ గుమ్మకొండ ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో యూత్‌ ఆడియన్స్‌ కి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ‘గుణ 369’ ‘హిప్పీ’ ’90 ఎంఎల్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’ వంటి సినిమాలలో నటించాడు. కార్తికేయ ప్రస్తుతం ”చావు కబురు చల్లగా” అనే మూవీలో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కొత్త దర్శకుడు కౌశిక్‌ పెగళ్ళపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈ ...

Read More »

సోషల్‌ డైలమా చూశా.. భయమేసింది.. సమంత

సాంకేతికత కొత్త పుంతలు తొక్కడం వల్ల ప్రయోజనం ఎంతో నష్టమూ అంతే. ఏ చిన్న అవకాశం దొరికినా టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యక్తిగత సమాచారాన్నంతా లాగేసి ఇబ్బంది పెట్టే వ్యక్తులు బాగా పెరిగిపోయారు. ఈ విషయంలో సెలబ్రెటీలైన తమకు కూడా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని అంటోంది హీరోయిన్‌ సమంత. నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ మధ్య ‘సోషల్‌ డైలమా’ అనే డాక్యుమెంటరీ చూశానని.. అది చూసినపుడు చాలా భయం కలిగిందని.. ప్రస్తుతం మన జీవితాలను ‘డేటా’ అనే అంశం శాసిస్తోందని.. వ్యక్తులకు ప్రైవేట్‌ లైఫ్‌ అన్నదే లేకుండా ...

Read More »