Cinema

అమ్మ..రాజశేఖరా..పులిహోర బాగానే కలుపుతున్నావుగా!

బిగ్ బాస్ ఐదు ఎపిసోడ్ లు పూర్తి అయిపోయాయి. మొదటి ఎపిసోడ్ పరిచయ కార్యక్రమాలు..నాగార్జున హంగామా ఆదరగోట్టేసింది. ఇక తరువాత ఎపిసోడ్ లు వినోదానికి తక్కువ..సాగదీతకు ఎక్కువ అన్నట్టు సాగాయి. హౌస్ లో ప్రారంభం నుంచీ ఇప్పటివరకూ అందర్నీ ఆకట్టుకున్న పార్టిసిపెంట్ ఎవరన్న ఉన్నారు అంటే అది ఒక్క గంగవ్వే! ఆమె ఒక్కరి కోసమే చాలా మంది ప్రేక్షకులు బిగ్ బాస్ చూస్తున్నారనిపిస్తోంది అంటే అది అతిశయోక్తి కాబోదు. ఇంకా ప్రారంభ ఎపిసోడ్ లె కదా అనుకుందామన్నా సరే.. అసలే కరోనా కాలంలో వినోదం ...

Read More »

కంగనాకు మద్దతుగా విశాల్‌ లేఖ!

శక్తిమంతమైన ఒక రాజకీయ నాయకుడిని, ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న కంగనకు పలువురి మద్దతు లభిస్తోంది. తాజాగా కంగనాకు హీరో విశాల్‌ తన మద్దతును ప్రకటించాడు. సోషల్‌ మీడియా ద్వారా ఆమెకు ఒక లేఖను పంపాడు. మహారాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేలపై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన నోరు మూయించాలనుకున్న మీరు…మిగిలిన కోట్ల గొంతుకలను మూయించగలరా? అని థాకరేని సూటిగా ప్రశ్నించింది. ఈ క్రమంలో కంగనకు మద్దతు తెలుపుతూ విశాల్‌ లేఖ రాశారు. ‘డియర్‌ కంగన… నీ గట్స్‌కు, ...

Read More »

మహేష్‌ స్టన్నింగ్‌ లుక్‌ ..

మహేష్‌బాబు కళ్లు చెదిరే స్టన్నింగ్‌లుక్‌ సోషల్‌మీడియాలో విడుదలైంది. సుమారు ఏడు నెలల విరామం అనంతరం ఆయన మళ్లీ మేకప్‌ వేసుకున్నారు. అయితే సినిమా కోసం కాదు. ఒక యాడ్‌ షూటింగ్‌ కోసం. బుధవారం హైదరబాద్‌లోని ఒక స్టూడియోలో ఈ షూటింగ్‌ జరిగింది. నేషనల్‌ లెవెల్‌ యాడ్‌ ఫిలింమేకర్‌ అవినాశ్‌ గోవారికర్‌ ఈ వాణిజ్య ప్రకటనను రూపొందిస్తున్నారు. షూటింగ్‌ ముగిసిన అనంతరం గోవారికర్‌ మహేష్‌ను ఫొటోలు తీశారు. వాటిలో స్టన్నింగ్స్‌ లుక్స్‌ తో ఉన్న ఈ ఫొటోను గోవారికర్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా, షూటింగ్‌లో ...

Read More »

రియా అరెస్టులో రాజకీయ కుట్ర?

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య అనేక మలుపులు తిరుగుతూ ఆయన ప్రేయసి రియా చక్రవర్తి అరెస్టుకు దారి తీసింది. సుశాంత్‌ ఆత్మహత్యను ముంబయి ప్రభుత్వం పట్టించుకోలేదని బీహార్‌ ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఈ నేపథ్యంలో ఆ కేసును సిబిఐకి అప్పగించాలని కోరింది. ఓట్ల కోసం బిజెపి పన్నిన ఎత్తుగడే ఇదని విమర్శలు ఉన్నాయి. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ డ్రగ్స్‌ కేసులో దోషిగా తేలుస్తూ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) మంగళవారం రియాను అరెస్టు చేసింది. దీని వెనుక రాజకీయ కుయుక్తులు ...

Read More »

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

మనసు మమత’, ‘మౌనరాగం’ సీరియల్స్‌ లో నటించిన బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఎస్‌ఆర్‌ నగర్‌లోని మధురానగర్‌లో తన నివాసంలో ఉమంగళవారం అర్థరాత్రి ఉరివేసుకున్నారు. బాత్‌రూమ్‌కు వెళ్లిన శ్రావణి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అనుమానంతో డోర్‌ను పగలకొట్టి చూడగా ఉరివేసుకుని ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మఅతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ...

Read More »

డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తి అరెస్టు

 సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రేయసి రియా చక్రవర్తిని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. డ్రగ్స్‌ కేసులో రియాను మూడు రోజుల నుండి ఎన్‌సిబి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని కూడా ఎన్‌సిబి అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది. అయితే తాను మాత్రం డ్రగ్స్‌ వాడలేదని, సుశాంత్‌ కోసమే కొనుగోలు ...

Read More »

ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి

టాలీవుడ్‌ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మరణించారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయారు. రాయలసీమ మాండలికంతో పలు సినిమాల్లో విలనిజం పండించారు. లాక్‌డౌన్‌ విధించిన నాటి నుండి షూటింగులు నిలిచిపోవడంతో గుంటూరులోని తన నివాసంలో ఉంటున్నారు. స‌మ‌ర‌సింహా రెడ్డి , ‘జయం మనదేరా’ వంటి ఫ్యాక్షన్‌ సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.  మ‌హేష్‌బాబు హీరోగా న‌టించిన  స‌రిలేరు నీకెవ్వ‌రు  సినిమాలో చివ‌రిసారిగా క‌నింపించారు.

Read More »

నటుడు విష్ణుతో గుత్తాజ్వాల ఎంగేజ్‌మెంట్‌

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తాజ్వాల తన ప్రియుడు, నటుడు విష్ణు విశాల్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. జ్వాల 37వ పుట్టినరోజులనే ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని ఆయన ట్వీట్‌ చేశారు. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. తన ట్వీట్‌లో జ్వాలకు బర్త్‌డే విషెష్‌ చెప్పిన విష్ణు కొత్త జీవితాన్ని కలిసి ప్రారంభిద్దామని అన్నారు. ‘అందమైన భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి కృషి చేద్దాం. మనతోపాటు ఆర్యన్‌, మన కుటుంబాలు, మిత్రులు అందరికీ మంచి భవిష్యత్‌ ఉండేలా ...

Read More »

ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్‌

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు. తన తండ్రికి కరోనా నెగిటివ్‌ అని వచ్చినప్పటికీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా మెరగవ్వలేదని చరణ్‌ తెలిపారు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవ్వడంతో వెంటిలేటర్‌ తొలగిస్తామని భావించామని, అయితే ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఊపరితిత్తులలో ఇంకా ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా తొలగిపోలేదని తెలిపారు. అయితే గతం కంటే ...

Read More »

‘లవకుశ’ నాగరాజు కన్నుమూత

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రం ‘లవకుశ’. ఈ చిత్రంలో లవుడి పాత్ర పోషించిన నటుడు నాగరాజు కన్నుమూశారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇక లవకుశతో పాటుగా ఆయన భక్తరామదాసు చిత్రంలోనూ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. అయన అసలు పేరు నాగేందర్‌రావు. సుమారుగా 300 ...

Read More »