Cinema

ఆ పరిస్థితిలో అకిరాకి ఎస్ చెప్తా.. పవన్ కి నో చెప్తా : అడివి శేష్

యంగ్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్స్ అందుకున్నడు. అయితే ఈ హీరోకి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరాతో చాలా మంచి స్నేహం ఉంది. వీరిద్దరు కలిసి ఉన్న చాలా ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్‌గా మారి..అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే అసలు వీరిద్దరి పరిచాయం ఎలా ఎర్పడింది అనే సందేహం చాలా మందిలో వచ్చింది. మంచు మనోజ్ టాక్ షోలో అడివి శేష్ వీరిద్దరి పరిచయం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఒకసారి నా ఫ్రెండ్ ఇంటికి ...

Read More »

SSMB29 ఓపెనింగ్ అప్‌డేట్ ఇచ్చేసిన‌ట్టేనా..?

బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ తో గ్లోబ‌ల్ స్టార్ డైరెక్ట‌ర్‌గా మారిపోయాడు ఎస్ఎస్ రాజ‌మౌళి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద తెలుగు సినిమాల రేంజ్‌ను పెంచెసాయి. పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబుతో చేస్తున్న సినిమా SSMB29 కావ‌డంతో అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ నేప‌థ్యంలో రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమా ఎప్పుడు లాంఛ్ కాబోతుంద‌న్న దానిపై ఓ ఆస‌క్తిక‌ర వార్త ...

Read More »

18 ఏళ్ల తర్వాత అజిత్‌ త్రిపాత్రాభినయం..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ తనకంటూ ప్రత్యేక శైలి, స్థానం సంపాదించుకున్నాడు. స్టార్‌ హీరోగా కొనసాగుతున్న అజిత్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ విజయాలను సాధించి..వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అయిదే ప్రస్తుతం విడాయమర్చి సినిమాలో త్రిష తో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మగిళ్‌ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్‌ తన తదుపరి 63వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ ...

Read More »

జాన్వీకి షాక్ ఇచ్చిన బోనీ..

జాన్వీ కపూర్ – శిఖర్ పహరియాతో పబ్లిక్ గా చాలా సార్లు కనిపించిన.. తమ రిలేషన్ ను అఫిషియల్ చేయలేదు. అయితే ఆ పని తన తండ్రి బోనీ కపూర్ చేసేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకున్న ఆయన.. శిఖర్ లాంటి అబ్బాయి తమ జీవితాల్లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. జాన్వీ గతంలో తనకు దూరంగా ఉన్నా.. తాను, అర్జున్ కపూర్ మాత్రం శిఖర్ తో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యామని చెప్పాడు. మొత్తానికి ఇద్దరూ మళ్లీ ఒక్కటైనందుకు హ్యాపీగా ...

Read More »

దిల్ రాజు బ్యానర్ లో విజయ్ రెండు సినిమా..

ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ ఈ వారం ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన తదుపరి సినిమాని చేయబోతున్నాడు. ఈ మూవీ 100 కోట్ల బడ్జెట్ భారీ చిత్రంగా రూపొందుతుంది. ఈ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ మళ్ళీ దిల్ రాజు ప్రొడక్షన్ లోనే నటించబోతున్నారని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో విజయ్ రెండు సినిమాలకు సైన్ చేశారట. వీటిలో ఆల్రెడీ ఒకటి ...

Read More »

తంగలాన్ అనౌన్స్‌మెంట్ ఆన్ ది వే.. !

విక్ర‌మ్ -మ‌ల‌బార్ సోయగం మాళవిక మోహనన్‌ న‌టిస్తున్న మూవీ తంగలాన్ . అయితే ఈ మూవీ నుంచి షేర్ చేసిన‌ మాళవికా మోహనన్‌ లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్. ఈ హీరో యాక్ట‌ర్ న‌టిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి తంగలాన్‌ . మ‌ల‌బార్ సోయగం మాళవిక మోహనన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ మూవీలో మాళవిక ఇదివరకెన్నడూ కనిపించని.. డీగ్లామరైజ్‌డ్‌ రోల్‌లో న‌టిస్తుంది. తంగలాన్ నుంచి షేర్ ...

Read More »

భగవద్గీత గొప్పతనాన్ని తెలుపుతూ సినిమా..

కృష్ణుడి తత్త్వం భోదిస్తూ ఇస్కాన్ సంస్థ సనాతన ధర్మాన్ని, శ్రీకృష్ణుడి చెప్పిన భగవద్గీతని వ్యాప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్కాన్ సంస్థ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఈ జనరేషన్ వారికి తెలియాలని ఓ సినిమాని తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో ముందుగా ఓ షార్ట్ ఫిలింని తెరకెక్కిస్తున్నారు.తెలుగు దర్శకుడు సంతోష్ జాగర్లపూడికి ఈ షార్ట్ ఫిలిం తీసే బాధ్యతని అప్పగించారు. ఈ షార్ట్ ఫిలింకి డివైన్ మెసెజ్ 1 అని పేరు పెట్టారు. దీనికి ఇస్కాన్ ప్రతినిధి సచినందన్ హరిదాస్ కథ అందించగా ...

Read More »

ఆయనతో సినిమా కోసం వెయిటింగ్…

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ జోరు మాములుగా లేదుగా.. డీజే టిల్లు సినిమాతో యువతను ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో తాజాగా టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి హిట్ కొట్టాడు. ఈయన మొదటిలో చిన్న చిన్న పాత్రల్లో నటించి.. ఆతర్వాత హీరోగా మారి గుంటూరు టాకీస్, మా వింత గాద లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 2022లో వచ్చిన డీజే టిల్లుతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలంగాణ యాసలో సిద్దు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఆ ...

Read More »

SSMB29 కథ పై విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు వైరల్..

RRR తర్వాత రాజమౌళి, మహేష్ బాబు డైరెక్గ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులో ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సారి పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా చేస్తున్నారని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఆల్రెడీ రాజమౌళి చెప్పారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ కూడా కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ ...

Read More »

మంగ్లీకి ఓ అరుదైన గౌరవం..

ప్రముఖ సింగర్ మంగ్లీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. మంగ్లీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ఓ జోష్ వస్తుంది… మొదట్లో యూట్యూబ్ ఛానల్ లో భక్తి సాంగ్స్, జానపద పాటలు పాడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విధంగా ఫేమస్ అయి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.శైలజా రెడ్డి అల్లుడు, జార్జి రెడ్డి , అలా వైకుంఠపురంలో, బలగం , భోళా శంకర్ , జవాన్ వంటి మరెన్నో చిత్రాల్లో పాడి తన గానంతో ప్రేక్షకులందర్ని కట్టిపడేసింది. తన సాంగ్స్ ...

Read More »