Health

పాలకూరతో ఆరోగ్యం.. రోజూ తింటే జరిగేది ఇదే!

ఆకు కూరలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది పాలకూరను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలకూరలో విటమిన్ ఏ, సి,కె తో పాటు ఐరన్ , మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి. పాల కూరను ప్రతి రోజూ మన ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణవ్యవస్థ మెరుగు పడటమే కాకుండా మలబద్ధకం సమస్య నుంచి బయటపడుతాము. అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడం ద్వారా కిడ్నీ సమస్యలు దరి చేరవు. పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువగా ...

Read More »

ఆ అనారోగ్య సమస్యలున్న వారు యాలుకలు అసలు తినకూడదు?

వంటకాలకు రుచిని జోడించడానికి ఉపయోగించే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఆరోగ్యకరమైనవి అలాగే మంచి రుచిని కలిగి ఉంటాయి. పాలలో చిటికెడు యాలకుల పొడి కూడా జీవక్రియను ప్రేరేపిస్తుంది. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. శారీరక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. అయితే యాలుకలు కొంతమందికి అస్సలు ఆరోగ్యకరమైనవి కావు. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు యాలకులను అస్సలు తినకూడదు.. అలాంటి వారు వీటిని తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు రెట్టింపు అవుతాయి. అలర్జీ బాధితులకు వీటికి దూరంగా ఉండాలి ...

Read More »

రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారా..

నడక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. రాత్రిపూట చాలామంది తరచుగా చూస్తూ ఉంటాం. భోజనం చేసిన తర్వాత అరగంట పాటు నడవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడుతుంది. అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావు. రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసే అలవాటు వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని ద్వారా అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందుతారు. మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవాలి. నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్ ...

Read More »

మునక్కాయలు అతిగా తింటున్నారా.. అయితే, వీటి గురించి తప్పక తెలుసుకోండి

మనలో చాలా మంది మునక్కాయలు ఇష్టంగా తింటారు. ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర , ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. మునగలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ప్రమాదకరం. శరీరానికి ఫైబర్ అవసరం అయినప్పటికీ, అతిగా తినడం మంచిది కాదు. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా, మలబద్ధకం, ప్రేగు సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మునగకాయలను ఎక్కువగా తినడం వల్ల అలర్జీ వస్తుంది.గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వీటిలో ములగ కూరలు ...

Read More »

పండగ రోజుల్లో మాంసాహారాన్ని ఎందుకు నిషేధించారు?.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే

మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పటి తరం తమ సంస్కృతిలో ఎన్నో పండగ రోజుల్లో మాంసం తినకపోవడం ఇప్పటికీ చాలా మంది హిందువులకు ఒక ముఖ్యమైన ఆచారం. ఇలా కొన్ని రోజులు మాంసాహారానికి దూరంగా ఉండటం వెనక అసలు కారణం ఉంది. రోజు నాన్ వెజ్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. పెద్ద పేగు క్యాన్సర్,అధిక రక్తపోటు, గుండెపోటు , అల్సర్ వంటి అనేక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. మామూలుగా చెబితే వినరు కాబట్టి పెద్దలు మతం, సైన్స్ అని చెప్తారు. వాటిని ...

Read More »

మెదడు చురుగ్గా పనిచేయాలా?

మనం ఏ పనిచేయాలన్నా అందుకు సంసిద్ధత ముఖ్యం. కానీ కొన్ని సందర్భాల్లో మనసు, శరీరం అందుకు అందుకు సహకరించవు. ఏ పని చేయాలన్నా ఏకాగ్రత కుదరకపోవడం, ఆసక్తి తగ్గడం వంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ప్రతి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడంవల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. దీర్ఘకాలంపాటు పోషకాహారం తీసుకోకపోతే కూడా మీ మైండ్ సక్రమంగా పనిచేయదు. అందుకే ప్రోటీన్లు, కార్బొ హైడ్రేట్లు, సీజనల్ ఫ్రూట్స్‌ తీసుకుంటూ ఉండాలి. ప్రకృతిని ఆస్వాదించడం, పచ్చని చెట్ల మధ్య కాసేపు గడపడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ...

Read More »

ఆస్తమా పేషెంట్లు ఏసీ గదుల్లో కూర్చోవచ్చా..

ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ వారి ఇళ్ళలో ఏసీ వేసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అయితే, ఆస్తమా రోగులు ఏసీ రూమ్‌లో కూర్చునే ముందు వీటి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆస్తమా రోగులకు చల్లని గాలి ప్రమాదకరం. వాతావరణంలోని ధూళి కణాలు ఎయిర్ కండీషనర్‌లో కరిగి ఆస్తమా రోగులకు హాని కలిగిస్తాయి. పీల్చినప్పుడు, ధూళి కణాలు ఉబ్బసం ఉన్నవారి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తాయి. ఇది మీ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఆస్తమా రోగులు ఏసీలో కూర్చునే ముందు ఈ విషయాలను పరిగణనలోకి ...

Read More »

ఇయర్ ఫోన్స్ వాడేవారికి ఆ ప్రమాదం తప్పదు..!

నేటి తరం ముఖ్యంగా యువత ఇప్పుడు ఎక్కడ చూసిన చెవి లో ఇయర్ ఫోన్స్ తో నో హెడ్ ఫోన్స్ తో నో కనిపిస్తుంటారు సాధారణంగా ఫోన్ ఎక్కువ సేపు మాట్లాడటానికి, ప్రయాణలలో పాటలు వినడానికి హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తుంటారు. వాకింగ్, జాగింగ్, వ్యాయామం సమయంలో కూడా ఇవి చెవులకు ఉండాల్సిందే. హెడ్ ఫోన్స్ వాడితే ప్రమాదం బారిన పడినట్లేనని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో ఆఫీస్ వర్క్ చేయాలన్నా, ఆన్లైన్ క్లాసులు చెప్పాలన్నా, వినాలన్నా హెడ్ ...

Read More »

మధుమేహాన్ని నియంత్రించే డార్క్ టీ గురించి విన్నారా..?

డార్క్ టీ అనేది.. ఇది సూక్ష్మజీవుల కిణ్వ ప్రక్రియ ప్రక్రియకు గురైనప్పుడు.. పూర్తిగా ఆక్సీకరణం చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ టీ ఆకులు ఆక్సీకరణ ప్రక్రియకు గురై రంగు మారుతాయి.ఇది చైనాలో ఒక సాధారణ టీ. అక్కడి ప్రజలు దీన్ని నిత్యం తాగుతుంటారు. బ్లాక్ టీతో పోలిస్తే డార్క్ టీ భిన్నంగా ఉంటుంది. బ్లాక్ టీ అధిక ఆక్సీకరణ ప్రక్రియకు లోనవుతుంది. టీ తాగని వారితో పోలిస్తే డార్క్ టీ తాగేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 53% తక్కువగా ఉంటుందని.. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ...

Read More »

పొట్ట ఉబ్బరాన్ని తగ్గించే జీరా వాటర్

జీలకర్ర.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వంటల్లో ఖచ్చితంగా వాడేదే కాబట్టి. ఇది కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, బి, సి, యాంటీఆక్సిడెంట్స్ వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ‘బి’ మన శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది. మరియు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. జీలకర్రని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉండేందుకు మంచిగా సహయపడుతుంది. పరగడుపున టీ, కాఫీ లకు ...

Read More »