Homepge Slider

అందరికీ పథకాల ఫలాలు దక్కాలి: వైఎస్​ జగన్​

ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలో అమలు కావాలని, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన శుక్రవారం సీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, పథకాల అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇదివరకే చెప్పామని, వెంటనే వాటిని పరిష్కరించి, అర్హత ఉన్నవారికి పథకాల ఫలాలు అందేలా చేయాలని అధికారులను ఆదేశించారు.కోవిడ్​ కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »

ఈ నెల 15న ఏపీ కేబినెట్‌ భేటీ

ఈ నెల 15న ఏపీ కేబినెట్‌ భేటీ

ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో వచ్చే బుధవారం జరిగే కేబినెట్‌ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్‌ నియంత్రణ చర్యలపై మంత్రి మండలి చర్చించనున్నట్టు సమాచారం. ఇక గత నెల 11న జరిగిన‌ భేటీలో వైఎస్సార్‌ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు కేబినెట్ ఆమోదం వేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో ...

Read More »

ఏపీని వణికిస్తున్న కరోనా.. మరో 15 మరణాలు

ఏపీని వణికిస్తున్న కరోనా.

ఏపీలో కరోనా డేంజర్ బెల్సి మోగిస్తూనే ఉంది. రోజు, రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టుల సంఖ్య పెంచే కొద్ది.. కేసులు బయటపడటం ఆందోళనల కలిగిస్తోంది. తాజా బులిటెన్‌లో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించగా 1576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 32మందికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 1608కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 25422కు చేరింది. ...

Read More »

మీ ఇంటికి ఈ కలర్స్ వేస్తే ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు..

ఇంట్లో ఉండే ప్రదేశాల్లో, సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మీ మానసిక స్థితి సరిగ్గా ఉంచడంలో సాయం చేస్తాయి. మీరు వాడే కలర్స్‌ మీ ఇంటి రూపాన్నే మార్చేస్తాయి. కావున మీరు ఎక్కువగా ఉండే స్థలాన్ని (ప్రధానంగా ఇల్లు) ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చూసుకోవడం మంచిది. పెరుగుతున్న వయస్సు మీ పిల్లలపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, మీ ఇంటి కోసం సూచించదగిన ఉత్తమమైన కలర్స్ గురించి తెలుసుకోండి. పసుపు.. ఈ రంగు మీ స్థలాన్ని కాంతివంతం చేస్తుంది. మీ మానసిక ...

Read More »

అనాస పండుతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?

కరోనా వైరస్ నేపథ్యంలో శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం కోసం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారు. చాలామంది వంటింటి చిట్కాలు పాటిస్తుంటే. కొందరు పండ్లు, కూరగాయల ద్వారా శరీరానికి రోగ నిరోధక శక్తి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటికి రుచి.. శరీరానికి ఆరోగ్యాన్ని అందించే ‘అనాస పండు’ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిందే. ఔనండి.. అనాస పండు (పైనాపిల్)తో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా కరోనా వైరస్‌పై పోరాడే శక్తిని కూడగట్టుకోవచ్చు. మరి, అనాస పండు తినడం వల్ల ...

Read More »

శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం !

ఏదైనా ఒక మంచి రోజు .. రాత్రి 10 గంటల తరవాత ఎదురుగా బల్లపై ఒక కలశం ఉంచాలి. ఈ కలశంపై కుంకుమపువ్వుతో ఒక స్వస్తిక గుర్తును చిత్రించి, అందులో నీరు నింపాలి. ఆ నీటిలో గరిక, అక్షతలు ఒక రూపాయి నాణెం వేయాలి. తరవాత చిన్నపళ్లెంలో బియ్యం పోసి, ఆ కలశంపై ఉంచాలి. దానిపై ఒక స్ఫటిక శ్రీయంత్రం స్థాపించాలి. ఆ కలశం దగ్గర నాలుగు ముఖాల దీపం వెలిగించి అక్షతలు, కుంకుమతో పూజించాలి. అనంతరం శ్రీ లక్ష్మీదేవిని 10 నిముషాలు ధ్యానించాలి. ...

Read More »

ప్రముఖ హాస్యనటుడు జగదీప్‌ మృతి

బాలీవుడ్‌ హాస్యనటుడు జగదీప్‌ (81) అలియాస్‌ సయ్యద్‌ ఇష్తియాక్‌ అహ్మద్‌ జాఫ్రీ మృతి చెందారు. ముంబైలోని ఆయన నివాసంలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం రాత్రి కన్నుముశారు. మార్చి 29, 1939న జగదీప్‌ జన్మించారు. ఆయనకు కుమారులు జావేద్‌ జాఫ్రీ, నవేద్‌ జాఫ్రీ ఉన్నారు. ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మతికి బాలీవుడ్‌ ప్రముఖులు, నటీనటులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. 400లకు పైగా సినిమాల్లో నటించిన జగదీప్‌ 1975లో ...

Read More »

ఆ ప్రశ్న నటులను ఎందుకు అడగరో?

ఆ ప్రశ్న నటులను ఎందుకు అడగరో?

సాధారణంగా హీరోలు వివాహం తర్వాత కూడా కథకు అవసరమైతే శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటారు. పెళ్లనేది వారి అవకాశాలకు అడ్డుకాదు. అలాగే పాత్రల ఎంపిక విషయంలోనూ ఎలాంటి మార్పూ అవసరంలేదు. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. పెళ్లయిందంటే చాలు.. అవకాశాలు తగ్గుతాయి. ఇక రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తే ‘పెళ్లయ్యాక కూడా ఇలాంటి సీన్లు చేయడం ఏంటి?’ అని విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. దీనిపై కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌ (‘జెర్సీ’ ఫేమ్‌) సోషల్‌ మీడియా వేదికగా ఓ చర్చకు తెరతీశారు. ‘పెళ్లయ్యాక హీరోయిన్‌కి నిజంగానే డిమాండ్‌ ...

Read More »

తెలంగాణ ఫుడ్స్‌లో కరోనా కలకలం

తెలంగాణ ఫుడ్స్‌లో కరోనా కలకలం

నాచారం తెలంగాణ ఫుడ్స్‌ సంస్థలో కరోనా కలకలం రేపింది. అందులో పనిచేసే కొంతమందికి పాజిటివ్‌ రావడంతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. మేడ్చల్‌ డీఎంహెచ్‌వో వీరాంజనేయులు సారథ్యంలో 434 మంది నుంచి గురువారం శాంపిల్స్‌ సేకరించారు. తెలంగాణ ఫుడ్స్‌ కంపెనీలో గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ చిన్నారుల కోసం బాలామృతం, స్నాక్స్, ఇతర పౌష్టికాహారం తయారవుతుంటుంది. తాజా ఘటనతో రెండ్రోజులుగా ఈ తయారీని నిలిపివేశారు. కాగా, నాచారంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కరోనా శాంపిల్స్‌ సేకరణ కొనసాగుతోంది. గురువారం 50 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ...

Read More »

రఘురామకృష్ణరాజుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు కూడా అదే బాటలో నడిచారు. గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసులకు ఎంపీపై ఫిర్యాదు చేశారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇటు నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కారమూరి నాగేశ్వరరావు, కొట్టి ...

Read More »