Homepge Slider

లిక్కర్ కేసులో కీలక పరిణామం…జైల్లోనే కవితను ప్రశ్నిస్తామన్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణకు హాజరు కావాలంటూ కవితకు గతంలోనే సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు సంబంధించి తన పిటిషన్ కోర్టులో ఉందని… అందువల్ల తాను కోర్టుకు హాజరుకాలేనని ఆమె సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఈడీ అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకుని విచారణ జరపడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ...

Read More »

శని ప్రదోష వ్రతం.. శివయ్యను ఎలా పూజించాలంటే..

సాధారణంగా ప్రదోష వ్రతం సాయంత్రం సమయంలో చేస్తారు. ప్రదోష వ్రతం నెలలో ఒకసారి వస్తుంది. ఈరోజు శివుడిని పూజించడం ఆచారంగా వస్తుంది. అయితే ప్రదోషవ్రతం ఈసారి అంటే ఏప్రిల్ 6 న శనివారం రానుంది. దీనిని శని ప్రదోష వ్రతం అంటారు. ఈ రోజున అత్యంత పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే శనివారం ప్రదోష వ్రతం రెండు కలిసి వచ్చినప్పుడు శని ప్రదోష వ్రతం ఆచరిస్తారు. శని త్రయోదశి అనేది శనీశ్వరుడిని ఆరాధించడానికి ముఖ్యమైన రోజు. ప్రదోషవతం రోజు శివుడిని పూజిస్తారు. ఈ ...

Read More »

ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంకు సీఎం రేవంత్ రెడ్డి!

ఐపీఎల్‌లో భాగంగా శుక్ర‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించ‌డానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియానికి వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. కుటుంబం స‌హా మ్యాచ్ చూసేందుకు సీఎం ఇప్ప‌టికే టికెట్లు కూడా బుక్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో గ‌తంలో రేవంత్ రెడ్డి ఉప్ప‌ల్ మైదానంలో మ్యాచ్ చూసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ ...

Read More »

హీరోయిన్‌ తండ్రి కన్నుమూత..

హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ఫిలిప్‌ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలో తుది శ్వాస విడిచారు. దీంతో మీరా జాస్మిన్‌ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. మీరా జాస్మిన్‌.. సూత్రధారన్‌ అనే మలయాళ చిత్రంలో కెరీర్‌ ఆరంభించింది. రన్‌ తో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పందెం కోడి, గుడుంబా శంకర్‌, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ...

Read More »

సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా..

బరువు తగ్గడం, శరీరంలో బలం లేకపోవడం వంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటూంటారు. వారు కాస్త బొద్దుగా తయారవుదాం అని ఎన్ని ప్రయత్నాలు చేసినా వీఫలమవుతుంటారు. అయితే ఉండాల్సిన దానికన్నా సన్నగా ఉంన్న వారిలో రోగనిరోధక శక్తి కూడా బలహీనమవుతుందని, దీని వలన సులభంగా అనేక వ్యాధుల బారిన పడవచ్చంటున్నారు నిపుణులు. బరువు పెరగడంలో ఇబ్బంది ఉన్నవారికి, కేలరీలు, ప్రోటీన్‌లతో కూడిన అల్పాహారం మంచి పరిష్కారం. అల్పాహారం దాటవేయడం వల్ల మీ ఏకాగ్రత తగ్గుతుంది. బరువు పెరగడానికి, మీరు గోధుమ గంజి, గుడ్లు, గింజలు, అవోకాడో, ...

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. మరో వంద సభలకు ప్లాన్

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టి జనాల్లో తిరుగుతున్నారు. అనంతరం భారీ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేలా హామీ ఇస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల సమయం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం వంద సభలు, రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read More »

ఇవాల్టి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా PCC చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. YSR(D) బద్వేల్లోని ఆమగంపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభించనుండగా.. కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేల్, అట్లూరులో యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల, 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. షర్మిలతో పాటు సునీత కూడా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్సుంది.

Read More »

సుభాష్ చంద్రబోస్ ప్రధాని అంటున్నారు:KTR

లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న BJP అభ్యర్థులపై మాజీ మంత్రి KTR ట్విటర్ వేదికగా విమర్శలకు దిగారు. ‘సుభాష్ చంద్రబోస్ మన మొదటి ప్రధాని అని ఉత్తరాదికి చెందిన ఒక BJP అభ్యర్థి చెప్పారు. దక్షిణాదికి చెందిన మరో BJP నాయకుడు మహాత్మా గాంధీ మన ప్రధాని అని చెప్పారు. వీళ్లంతా ఎక్కడి నుంచి పట్టభద్రులయ్యారు?’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ‘వీరిదంతా వాట్సాప్ యూనివర్సిటీ’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More »

నేడు, రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు

నేడు, రేపు భానుడు ఉగ్రరూపం దాల్చనున్నాడు. విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం రాష్ట్రంలో కొన్ని చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అనంతపురం (D)లో 41 నుంచి 43 డిగ్రీలు, పల్నాడు, NTR జిల్లాల్లో 41-44, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూ.గో జిల్లాల్లో 41-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. నిన్న నంద్యాల(D) చాగలమర్రిలో గరిష్ఠంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Read More »

పుష్ప-2 మ్యూజిక్ సెషన్స్ లో త్రిమూర్తులు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2. తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ లో అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురూ పాల్గొన్నారు. ఈ చిత్రం కోసం సంచలన నేపథ్య సంగీతానికి రూపకల్పన చేస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించింది. ఈ బీజీఎంను ఏప్రిల్ 8న రిలీజ్ అయ్యే టీజర్ లో వినొచ్చని వివరించింది.అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్… ఈ త్రిమూర్తుల కాంబోలో వచ్చిన పుష్పలో పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయి. ఈ చిత్రంలో నేపథ్య సంగీతం కూడా ...

Read More »