News

అందరికీ పథకాల ఫలాలు దక్కాలి: వైఎస్​ జగన్​

ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలో అమలు కావాలని, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన శుక్రవారం సీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, పథకాల అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇదివరకే చెప్పామని, వెంటనే వాటిని పరిష్కరించి, అర్హత ఉన్నవారికి పథకాల ఫలాలు అందేలా చేయాలని అధికారులను ఆదేశించారు.కోవిడ్​ కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ...

Read More »

ఈ నెల 15న ఏపీ కేబినెట్‌ భేటీ

ఈ నెల 15న ఏపీ కేబినెట్‌ భేటీ

ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో వచ్చే బుధవారం జరిగే కేబినెట్‌ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్‌ నియంత్రణ చర్యలపై మంత్రి మండలి చర్చించనున్నట్టు సమాచారం. ఇక గత నెల 11న జరిగిన‌ భేటీలో వైఎస్సార్‌ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు కేబినెట్ ఆమోదం వేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో ...

Read More »

ఏపీని వణికిస్తున్న కరోనా.. మరో 15 మరణాలు

ఏపీని వణికిస్తున్న కరోనా.

ఏపీలో కరోనా డేంజర్ బెల్సి మోగిస్తూనే ఉంది. రోజు, రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టుల సంఖ్య పెంచే కొద్ది.. కేసులు బయటపడటం ఆందోళనల కలిగిస్తోంది. తాజా బులిటెన్‌లో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,020 మందికి పరీక్షలు నిర్వహించగా 1576 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 32మందికి వైరస్ సోకింది.. దీంతో మొత్తం కేసులు 1608కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 25422కు చేరింది. ...

Read More »

ఆ ప్రశ్న నటులను ఎందుకు అడగరో?

ఆ ప్రశ్న నటులను ఎందుకు అడగరో?

సాధారణంగా హీరోలు వివాహం తర్వాత కూడా కథకు అవసరమైతే శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటారు. పెళ్లనేది వారి అవకాశాలకు అడ్డుకాదు. అలాగే పాత్రల ఎంపిక విషయంలోనూ ఎలాంటి మార్పూ అవసరంలేదు. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. పెళ్లయిందంటే చాలు.. అవకాశాలు తగ్గుతాయి. ఇక రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తే ‘పెళ్లయ్యాక కూడా ఇలాంటి సీన్లు చేయడం ఏంటి?’ అని విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. దీనిపై కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్‌ (‘జెర్సీ’ ఫేమ్‌) సోషల్‌ మీడియా వేదికగా ఓ చర్చకు తెరతీశారు. ‘పెళ్లయ్యాక హీరోయిన్‌కి నిజంగానే డిమాండ్‌ ...

Read More »

తెలంగాణ ఫుడ్స్‌లో కరోనా కలకలం

తెలంగాణ ఫుడ్స్‌లో కరోనా కలకలం

నాచారం తెలంగాణ ఫుడ్స్‌ సంస్థలో కరోనా కలకలం రేపింది. అందులో పనిచేసే కొంతమందికి పాజిటివ్‌ రావడంతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. మేడ్చల్‌ డీఎంహెచ్‌వో వీరాంజనేయులు సారథ్యంలో 434 మంది నుంచి గురువారం శాంపిల్స్‌ సేకరించారు. తెలంగాణ ఫుడ్స్‌ కంపెనీలో గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ చిన్నారుల కోసం బాలామృతం, స్నాక్స్, ఇతర పౌష్టికాహారం తయారవుతుంటుంది. తాజా ఘటనతో రెండ్రోజులుగా ఈ తయారీని నిలిపివేశారు. కాగా, నాచారంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కరోనా శాంపిల్స్‌ సేకరణ కొనసాగుతోంది. గురువారం 50 మంది నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ...

Read More »

రఘురామకృష్ణరాజుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు ప్రకటించారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు కూడా అదే బాటలో నడిచారు. గ్రంధి శ్రీనివాస్ భీమవరం పోలీసులకు ఎంపీపై ఫిర్యాదు చేశారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఇటు నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు కూడా ఫిర్యాదు చేశారు. అలాగే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కారమూరి నాగేశ్వరరావు, కొట్టి ...

Read More »

ఏపీకి రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర పరిసర ప్రాంతాలలో 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో వానలు కురస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్నిచోట్ల, రేపు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు బుధవారం ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. గుంటూరు, ...

Read More »

స్వీయ నిర్బంధంలో సీఎం

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బుధవారం హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యే మథుర మహతో, రాష్ట్ర మంత్రి మిథిలేష్‌ ఠాకూర్‌లకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ముందుజాగ్రత్త చర్యగా తాను బుధవారం నుంచి కొన్నిరోజులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నానని సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేశారు. తన కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ హోం క్వారంటైన్‌కు వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యమైన ...

Read More »

తెలంగాణ హైకోర్టు మూసివేత‌

తెలంగాణ హైకోర్టులో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మంగ‌ళ‌వారం న్యాయ‌స్థానంలో ప‌ని చేసే 50 మందికి సిబ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. నేడు దీని ఫ‌లితాలు వెలువ‌డ‌గా అందులో 10 మందికి పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు హైకోర్టు భ‌వ‌నాన్ని మూసివేసి శానిటైజేష‌న్ చేస్తున్నారు. హైకోర్టులోని ఈ-ఫైలింగ్ విభాగాన్ని జ్యుడీషియ‌ల్ అకాడ‌మీకి త‌ర‌లించారు.మ‌రోవైపు క‌రోనా ప్రబ‌‌లుతున్న వేళ ముందు జాగ్ర‌త్త‌లు చేప‌ట్టిన హైకోర్టు వీడియో కాన్ఫ‌రెన్స్‌ల ద్వారా ముఖ్య‌మైన కేసుల విచార‌ణ ...

Read More »

వైఎస్సార్‌ పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది

వైఎస్సార్‌ పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది

జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ‘దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన గుప్తుల కాలాన్ని మరిపించింది. వైఎస్సార్‌ హయాంలో రైతుల సంక్షేమానికి బాటలు పడ్డాయి. 22 లక్షల హెక్టార్ల కు సాగు నీరు అందించి భూములను సస్యశ్యామలం చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అంటే వ్యవసాయం పండగ ...

Read More »