Crime

డ్రగ్స్‌ కేసులో రియా చక్రవర్తి అరెస్టు

 సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రేయసి రియా చక్రవర్తిని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. డ్రగ్స్‌ కేసులో రియాను మూడు రోజుల నుండి ఎన్‌సిబి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిని కూడా ఎన్‌సిబి అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. సుశాంత్‌ కోసం డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది. అయితే తాను మాత్రం డ్రగ్స్‌ వాడలేదని, సుశాంత్‌ కోసమే కొనుగోలు ...

Read More »

రియా సోదరుడు, సుశాంత్‌ మేనేజర్‌ అరెస్ట్‌

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరండాలను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఇద్దరినీ దాదాపు 10 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్‌ చేసినట్టు ఎన్‌సిబి అధికారులు తెలిపారు. అంతకుముందు ఉదయం షోవిక్‌, మిరండా నివాసాల్లో ఎన్‌సిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షోవిక్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. షోవిక్‌ చక్రవర్తి గంజాయి, ...

Read More »

సుశాంత్‌ కేసు సిబిఐకి అప్పగింత!

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మతి పట్ల యావత్‌ దేశ వ్యాప్తంగా అనుమానాలు వెల్లెవెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో బీహార్‌ సిఎం నితీష్‌ కుమార్‌ సుశాంత్‌ కేసుని సిబిఐకి అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఈ కేసును సిబిఐకి బదలాయిస్తున్నట్టు వెల్లడించింది. గత కొంత కాలంగా సుశాంత్‌ కేసు కొలిక్కి రావడం లేదు. రోజుకో ట్విస్ట్‌ బయటికి వస్తోంది. దీనికి తోడు సుశాంత్‌ కేసుని విచారిస్తున్న ముంబై పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. సుశాంత్‌ తండ్రి పెట్టిన కేసు విచారణ కోసం ...

Read More »

లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

లోకేష్ పై పంచులు వేసిన విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ”అచ్చెన్నాయుడు ఒక సంతకంతోనే అరెస్టు అయితే.. మంత్రిగా నేను అలాంటివి రోజుకు వంద పెట్టా.. ‘ అన్న లోకేష్ స్టేట్ మెంట్ చూసి.. చంద్రబాబు.. ‘ఆహా..! నా కొడుకు ఏం మాట్లాడుతున్నాడు’ అని గర్విస్తాడా, లేక…’ అంటూ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో ‘లోకేష్…! సొంత పెళ్ళానికి వాట్సాప్ మెసేజ్ పెట్టాలంటే.. జగన్ గారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తోందన్నావ్. అవునా…! తీసుకుంటున్నావా…? ఎందుకయ్యా.. రాజకీయాల్లో ...

Read More »

‘వైఎస్సార్ యాప్’‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

‘వైఎస్సార్ యాప్’‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్ర‌భుత్వం చ‌ర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవ‌సాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్ కార్య‌ల‌యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ ...

Read More »

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు

టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మునిసిపల్‌ కమిషనర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్ర పటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్‌ గదిలోకి మార్చారు. విషయం తెలిసిన మాజీ మంత్రి ఆ ఫొటోను యథాస్థానంలో ఉంచాలంటూ మునిసిపల్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఆ సమయంలో మునిసిపల్‌ కమిషనర్‌ టి. కఅష్ణవేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు ...

Read More »

డాక్టర్‌ సుధాకర్‌ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

డాక్టర్‌ సుధాకర్‌ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయి గురువారం హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. తన కొడుకు సుధాకర్‌ను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని, 24 గంటల్లో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ పిటిషన్‌ వేశారు. విచారణ అనంతరం ఎపిలో సంచలనంగా మారిన విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాల మత్తు వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఆయన అనుమతితో సుధాకర్‌ ఎప్పుడైనా డిశ్చార్జ్‌ కావొచ్చని హైకోర్టు సూచించింది. అయితే ...

Read More »

మళ్లీ తెరపైకి రిషితేశ్వరి కేసు.. ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

మళ్లీ తెరపైకి రిషితేశ్వరి కేసు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్‌ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసును పోక్సో చట్టం కిందే పరిగణించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీటును ఆరు నెలల్లోపు తేల్చాలని పోక్సో స్పెషల్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఆదేశించారు. ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందితులపై పోలీసుల ఛార్జ్‌షీట్‌ను గుంటూరులోని పోక్సో స్పెషల్ కోర్ట్ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. లైంగిక వేధింపులకు గురైన సమయంలో ఆ యువతి మైనరేనని.. ...

Read More »

రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

రక్తదానం చేసిన మాజీ ఎంపీ కవిత

యువత రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారంరోజుల పాటు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత రక్తదానం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వీలైనంత ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

Read More »

నర్సింగ్ యాదవ్‌కు సీరియస్

నర్సింగ్ యాదవ్‌కు సీరియస్

సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌కు సీరియస్‌గా ఉన్నట్లుగా సమాచారం. ఈరోజు (గురువారం) ఆయన తన ఇంట్లో నాలుగు గంటల సమయంలో సడెన్‌గా పడిపోవడంతో, తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేర్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఆయనకు చికిత్స అందుతుందని, పరిస్థితి కొంచెం సీరియస్‌గానే ఉందని, ఆయనకు చికిత్స అందించిన డాక్టర్స్ తెలిపినట్లుగా సమాచారం

Read More »