News

ఒంగోలు రిమ్స్ వద్ద హై టెన్షన్..

ఆంధ్రప్రదేశ్‌‌లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. తాజాగా ఒంగోలులోని ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాగా ఈ ఘర్షణలో ఇరు పార్టీల కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడిన వారిని ఒంగోలులోని రిమ్స్‌లో జాయిన్ చేశారు. గాయపడిన వారిని ఒంగోలులోని రిమ్స్‌లో జాయిన్ చేశారు. దీనితో ఆసుపత్రి చుట్టూ భారీగా పోలీసులు మొహరించారు. అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావు కూడా రిమ్స్ వద్దకు చేరుకున్నారు.

Read More »

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్..

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఇన్ కం ట్యాక్స్ కు సంబంధించి నోటీసులు ఇచ్చిన ఐటీ శాఖ.. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. తర్వాత రిలీజ్ చేసినప్పటికీ వంద కోట్లకు పైగా నిధులను బ్లాక్ చేసింది. దీంతో పార్టీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఖర్గే, రాహుల్ సహా పలు సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నేషనల్ ...

Read More »

అనిల్ అంబానీకి షాక్!

ఒకప్పుడు అపరకుబేరుడిగా ఓ వెలుగువెలిగిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సుప్రీం కోర్టులో ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు.. ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8 వేల కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది

Read More »

టీడీపీలోకి రామ్ లక్ష్మణ్ చేరికకు ముహూర్తం ఫిక్స్

యువ నాయకులు రామ్ లక్ష్మణ్‌లు టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13వ తేదీన రామ్ లక్ష్మణ్ టీడీపీలో జాయిన్ అవ్వనున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి పార్థసారథి ఆధ్వర్యంలో తిరిగి సొంత గూటికి చేరనున్నారు. కర్ణాటక నాగేపల్లి నుండి బుక్కపట్నం, కొత్తచెరువు, సూపర్ హాస్పిటల్, పుట్టపర్తి హనుమాన్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. టీడీపీలోకి రీ ఎంట్రీ సందర్భంగా భారీ జన సమీకరణకు రామ్ లక్ష్మణ్‌లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Read More »

సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉంది. కవితను జైల్లో విచారించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించింది. సీబీఐ తనను ప్రశ్నించడాన్ని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సవాల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కవితను విచారించారని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సీబీఐ నుంచి తమకు కౌంటర్ రిప్లై అందలేదని కవిత తరపు లాయర్ చెప్పగా… ఆ అవసరం లేదని సీబీఐ బదులిచ్చింది. శనివారమే కవితను తాము ప్రశ్నించామని… కాబట్టి కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ...

Read More »

భువనగిరి ముఖ్యనేతలతో రేవంత్ రెడ్డి సమావేశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గస్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ తర్వాత మే మొదటి వారంలో మరో బహిరంగ సభను నిర్వహిస్తారు.

Read More »

రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్.!

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల సిద్ధాంతాల మధ్య సారుప్యతను పోలుస్తూ.. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు! అని చెబుతూ.. ఒకవైపు భారతదేశాన్ని ఎప్పుడూ సమైక్యంగా ఉంచిన కాంగ్రెస్, మరోవైపు ప్రజలను విభజించే ప్రయత్నం చేసేవారు మరోవైపు ఉన్నారని పేర్కొన్నారు. అలాగే దేశాన్ని విభజించాలనుకునే శక్తులతో చేతులు కలిపి వారిని బలోపేతం చేసి దేశ సమైక్యత, స్వాతంత్య్రం కోసం ఎవరు పోరాడారో ...

Read More »

వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా వ‌ల‌స‌లు..

ఎన్నిక‌ల వేళ తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల నుంచి భారీగా వ‌ల‌స‌లు మొద‌ల‌య్యాయి. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ పాల‌న‌కు ఆక‌ర్శితులైన టీడీపీ, జన‌సేన కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ సమక్షంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు చేరారు.

Read More »

ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించిన రఘురాజు..

ఉండి అసెంబ్లీ టీడీపీ టికెట్ తనదేనని ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తన టికెట్ విషయంలో 48 గంటల్లో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెదఅమిరంలో ఆయన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. తద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉండి టీడీపీ టికెట్ ను చంద్రబాబు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అసంతృప్తికి గురైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో, ఇద్దరి మధ్యలో ...

Read More »

ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌పై ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి పోటీ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌పై ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి పోటీ చేస్తున్నారు. తమన్నా సింహాద్రి గతంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గానూ పాల్గొంది. భారత చైతన్య యువజన పార్టీ తరఫున తమన్నా సింహాద్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాజాగా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

Read More »