News

నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈరోజు విడుదల చేయనుంది. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యమిచ్చే అంశాలను ఇందులో ప్రస్తావించనుంది. ఉపాధి హక్కుపై యువతకు భరోసా ఇవ్వనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీపై కఠినమైన చట్టాన్ని రూపొందించే హామీకి ఇందులో చోటివ్వనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఈ మేనిఫెస్టోను ఢిల్లీలో ఆవిష్కరిస్తారు.

Read More »

కేసీఆర్ కీలక ప్రకటనపై ఉత్కంఠ!

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక బస్సులో రానున్న ఆయన తొలుత తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో రైతులతో మాట్లాడుతారు. కాగా ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read More »

88.03శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

రాష్ట్రంలో ఇప్పటివరకు 88.03% పెన్షన్ల పంపిణీ పూర్తైంది. నిన్న ఉ.7 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించగా.. ఎక్కువ అనారోగ్య సమస్య ఉన్న వారు, వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందించారు. మొత్తంగా ఒకటిన్నర రోజుల్లో 57.83 లక్షల మంది లబ్ధిదారులకు ₹1749.53 కోట్లు అందించారు. ఇవాళ కూడా ఉ.7 గంటల నుంచి రా. 7 గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ కొనసాగనుంది.

Read More »

నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం

సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శుక్రవారం విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోకి యాత్ర ప్రవేశించగా.. చింతారెడ్డిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రంలోనే ఈరోజు సీఎం జగన్ ఉంటారు. శనివారం ఉదయం తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. ఎల్లుండి సాయంత్రం 4గంటలకు కావలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Read More »

చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ ట్వీట్

ఏపీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చిన్న సింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురం జిల్లా శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడని, చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోవడంతో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వెల్లడించారు. ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ ను చట్టసభకు పంపించేందుకు తాము టికెట్ ఇచ్చామని, దీనిపై టీడీపీ ...

Read More »

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసం నుంచి ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. కోర్టు అనుమతితో ఆమెను ఈడీ పది రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత ఆమెకు న్యాయస్థానం జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. కవిత కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను ...

Read More »

టీడీపీ వల్లే పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందన్న విజయసాయిరెడ్డి

ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయించరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, టీడీపీ పెన్షన్లను ఆపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఎక్స్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ… టీడీపీ వల్లే ఏపీలో 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని విమర్శించారు. ఇది టీడీపీ నేతల మెంటాల్టీకి నిదర్శనమని చెప్పారు. తన బినామీలకు, ల్యాండ్ మాఫియా స్నేహితులకు చెల్లింపులు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ...

Read More »

ప్రతిపక్షాలకి ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్..!

అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడం ప్రజలు నిరదీశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కొడాలి నాని. నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోనని చెప్పారు. గుడివాడలో నన్ను రాష్ట్రంలో సీఎం జగన్ ని ఎవ్వరూ ఓడించలేరు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. అయినా తనపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల వద్దని చెప్పిన నా కాళ్లు కడిగారు అని ...

Read More »

చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: వైఎస్ అవినాశ్ రెడ్డి

అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడ్డారని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. మండుటెండల్లో పెన్షన్ల కోసం వెళ్లిన పలువురు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబును ప్రజలు సస్పెండ్ చేయాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే నేతలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కూటమి పేరుతో ఇతర పార్టీలను కూడగట్టుకుని చంద్రబాబు వస్తున్నారని అవినాశ్ అన్నారు. రంగురంగుల మేనిఫెస్టోతో ఇప్పుడు ఎన్నికలకు ...

Read More »

వాలంటీర్ వ్యవస్థను ఎవ్వరూ ఏం చేయలేరు : సజ్జల

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయించొద్దని రీసెంట్ గా ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఏపీలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే 400 మంది రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే ఈ ఇష్యూపై తాజాగా ఏపీ రాష్ట్ర సలహా దారుడు సజ్జల స్పందించి.. ‘‘వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వృద్ధులు ఎండల్లో ...

Read More »