News

మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తావా.. చంద్రబాబూ : YCP

ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వైసీపీ ప్రశ్నించింది. ‘చంద్రబాబూ చూశావా ముస్లింలపై బీజేపీ నిజస్వరూపం! దేశ సంపద ముస్లింలకు ఇస్తే ఊరుకుంటామా? అని స్వయంగా మోదీ గారే చెప్తున్నారు. అలాంటి బీజేపీతో నువ్వు, పవన్ పొత్తు పెట్టుకున్నారు. మోదీ వ్యాఖ్యలను సమర్థిస్తావా? లేదా మైనారిటీల పక్షాన నిలబడి వ్యతిరేకించే దమ్ము టీడీపీ, జనసేనలకు ఉందా?’ అని YCP ట్వీట్ చేసింది.

Read More »

నేటితో ముగియనున్న కవిత జుడీషియల్ కస్టడీ

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన MLC కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ED, CBI ఆమెను వర్చువల్గా కోర్టులో హాజరుపర్చనున్నాయి. కవిత కస్టడీని మరోసారి పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరనున్నాయి. మరోవైపు ఈడీ అరెస్ట్ప కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును జడ్జి మే 2కు వాయిదా వేశారు. సీబీఐ అరెస్ట్ప వేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు నిన్న ప్రారంభం కాగా నేడూ కొనసాగనున్నాయి.

Read More »

టీడీపీ సాంగ్‌పై ఈసీకి ఫిర్యాదు

సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సాంగ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిలపై సైతం ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్, షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 100 చోట్ల సమస్యాత్మక బూత్‌లున్నాయని, అక్కడ ...

Read More »

సీఎం జగన్‌ ఇవాళ్టి బస్సుయాత్ర షెడ్యూల్‌ ఇదే

సీఎం జగన్‌ ఇవాళ్టి బస్సుయాత్ర షెడ్యూల్‌ విడుదల అయింది. మేమంతా సిద్ధం – 21వ రోజు షెడ్యూల్ ప్రకారం… వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 9 గంటలక ఎండాడ MVV సిటీ రాత్రి బస నుంచి బయలుదేరి మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని బొద్దవలస మీదుగా సాయంత్రం ...

Read More »

ఎల్లుండి నుంచి వేసవి సెలవులు..స్కూళ్లకు ప్రభుత్వం హెచ్చరిక

పాఠశాలలకు ఈ నెల 24నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం కానుండగా సెలవుల్లో పాఠశాలలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ హెచ్చరించింది. చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 23వ తేదీ ఆఖరి పని దినం కానున్నట్లు తెలిపింది. అదే రోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందిస్తామని చెప్పింది.

Read More »

అలాంటి వాళ్ల గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది: సజ్జల

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి అంశంపై స్పందించారు. చిరంజీవిని ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరని స్పష్టం చేశారు. చిరంజీవి గొప్ప సినిమా స్టార్ అని, కానీ ఆయన బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. చెడు ఆలోచనలు చేసే వారి గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇక, పవన్ కల్యాణ్ కు ...

Read More »

సీఎం జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి

ఏపీ సీఎం జగన్ తరఫున ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో ఇవాళ నామినేషన్ దాఖలైంది. సీఎం జగన్ తరఫున ఆయన చిన్నాన్న, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అనంతరం వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ తరఫున ఇవాళ ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశామని, ఈ నెల 25న సీఎం జగన్ స్వయంగా వచ్చి మరో సెట్ నామినేషన్ వేస్తారని వివరించారు. 25వ తేదీ మధ్యాహ్నం ...

Read More »

క‌విత‌కు మ‌రోసారి షాక్‌.. బెయిల్ పిటిష‌న్‌పై తీర్పు వాయిదా!

సీబీఐ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత వేసిన బెయిల్ పిటిష‌న్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 2కు వాయిదా వేసింది. ఈడీ అరెస్టులో ఆమె దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ కొన‌సాగుతోంది. సీబీఐ కేసులో తీర్పును రిజ‌ర్వ్ చేసిన న్యాయ‌స్థానం.. ఈడీ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందోన‌ని ఉత్కంఠ నెల‌కొంది. కాగా, ఢిల్లీ మద్యం కుంభ‌కోణం కేసులో క‌విత‌ను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న‌ అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె రెండు బెయిల్ ...

Read More »

సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు

సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సతీష్‌ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి నిందితుడి నుండి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని.. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తుండగా విజయవాడలో సీఎం జగన్‌పై రాళ్ల ...

Read More »

వైసీపీలో చేరిన నటుడు గౌతం రాజు

ఎన్నో చిత్రాల్లో నటించిన గౌతం రాజు నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గౌతం రాజుతో పాటు కొంత మంది కార్యకర్తలు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

Read More »