News

తనిఖీల్లో రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయి: సీఎస్ శాంతికుమారి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వివిధ చెక్‌పోస్ట్‌ల వద్ద తనిఖీలు నిర్వహించగా రూ.10 కోట్లకు పైగా పట్టుబడ్డాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే పని చేశారో అదే స్ఫూర్తితో లోక్ సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతగా పనిచేయాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, అటవీ, రెవెన్యూ, రవాణా తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ...

Read More »

కేసీఆర్‌కు షాక్… కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా విఠల్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More »

ఏపీలో అందరూ ఎన్నికల రూల్స్‌ పాటించాల్సిందే: సీపీ రవి శంకర్‌

రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా అందరూ రూల్స్‌ పాటించాలన్నారు సీపీ రవి శంకర్‌. కొంత మంది పర్మిషన్‌ లేకుండా పొలిటికల్‌ మీటింగ్స్‌ పెడుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, విశాఖ సీపీ రవి శంకర్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పొలిటికల్‌ పార్టీలు అన్ని ప్రచారం కోసం సువిధ యాప్‌ ద్వారా పర్మిషన్‌ తీసుకోవాలి. ఒకవేళ యాప్‌ పనిచేయకపోతే రిటర్నింగ్‌ అధిaకారి వద్ద అనుమతి తీసుకోవాలి. ఎన్‌వోసీ మాత్రం పోలీసులు ఇస్తారు. ర్యాలీలు, మీటింగ్‌, డోర్‌ టూ డోర్‌ ప్రచారానికి పోలీసులు అనుమతి ...

Read More »

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారు కొనసాగుతారని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. పరీక్ష రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది ఏపీపీఎస్సీ. ఈ తరుణంలోనే.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారు కొనసాగుతారని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉద్యోగులు ...

Read More »

ఈడీ కస్టడీలో కవిత ఉపవాసం..మరోసారి చెల్లిని కలిసి మాట్లాడిన కేటీఆర్

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. వారం రోజుల కస్టడీలో భాగంగా కవితను అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విచారణ సమయం పూర్తయిన తర్వాత కవిత ఎలా గడుపుతున్నారు.. ఏం చేస్తున్నారనే వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. బ్రేక్ సమయంలో, ఉదయం సాయంకాలం వేళల్లో కవిత పుస్తక పఠనం చేస్తున్నారని తెలిసింది. బుధవారం ఏకాదశి కావడంతో ఉపవాసం చేశారట. ఆమె కోరిక మేరకు అధికారులు ...

Read More »

నేడు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ !

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 8 స్థానాలకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భువనగిరి స్థానాలు పెండింగ్ లో పెట్టనుంది కాంగ్రెస్‌ పార్టీ. ఆ స్థానాల్లో ఆశావహులు ఎక్కువ ఉన్నందున అభ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో ఆలస్యం కానుంది. ఇది ఇలా ఉండగా… నాగర్ కర్నూల్ లోకసభ టిక్కెట్ మాదిగలకు ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ నియోజకవర్గంలో మాదిగ ఓట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ...

Read More »

అక్కడి నుంచే కేసీఆర్ పోటీ!

మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ టికెట్‌ను ప్రకటించినప్పటికీ, మెదక్‌ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్‌ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్‌పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్‌ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు ...

Read More »

చంద్రబాబు జీవితంలో మంచి రోజులు అయిపోయాయి: విజయసాయిరెడ్డి

టీడీడీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబులాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. ఆయన జీవితంలో మంచి రోజులు అయిపోయాయని… తన కొడుకు లోకేశ్ ని ప్రమోట్ చేయడం, రిటైర్మెంట్ జీవితం కోసం డబ్బులు సంపాదించడమే ఇప్పుడు ఆయన ఏకైక అజెండా అని అన్నారు. తన ఆకాంక్షలే చచ్చిపోతే ఏపీ ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరని ప్రశ్నించారు. ఏపీకి విధానపరమైన కొనసాగింపును తీసుకురాగల స్థిరమైన యువ నాయకుడు కావాలని ...

Read More »

కడప నేతలతో నేడు షర్మిల భేటీ.. కీలక ప్రకటన వెలువడే అవకాశం!

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సమావేశం జరగబోతోంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు, తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కడప ...

Read More »

లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత కు షాక్ ఇచ్చిన కోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి అరెస్టు కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయి.. ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో తనని ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు.. కవిత వాదనను కొట్టివేసింది. పీఎమ్ఎల్ఏ చట్టంలో సెక్షన్-19ను ఈడీ ...

Read More »