News

నేడు మేడారం మహా జాతర ప్రారంభం

ఆసియాలోనే అది పెద్ద మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈ ఆదివాసీ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకూ జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్ద రాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. పూర్వకాలంలో ఈ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, ...

Read More »

పులిలా పోరాడుతాను తప్ప.. పిల్లిలా వెనుకడుగు వేయను : కేసీఆర్

ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అని పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్. తాజాగా ఛలో నల్గొండ బహిరంగ సభలో మాట్లాడారు కేసీఆర్. బీఆర్ఎస్ వచ్చాక నల్గొండ ఫ్లోరైడ్ రహితంగా చేశామన్నారు. ఓటు సమయంలో నంగనాచి కబుర్లు చెబుతారు.. తరువాత ఎవ్వరూ రారు అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుంది అంటారు. ఉమ్మడి రాష్ట్రం బాగుంటే ఇంత ఉద్యమం ఎందుకు జరిగింది అని ప్రశ్నించారు కేసీఆర్. కేసీఆర్ ని తిడితే కాంగ్రెసోల్లు పెద్దోళ్లు అవుతారా..? అధికారం ఎవ్వరికీ శాశ్వతం ...

Read More »

ఈ రోజు దిల్ రాజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ రేన్నా…

తెలుగు సినీ ఇండస్ట్రీలో దిల్ రాజుకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మొదట్లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి టాలీవుడ్ ని శాసించే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఏ సినిమా విడుదలైన దిల్ రాజు హెల్ప్ లేనిదే బయటకు రాలేని పరిస్థితి. అయితే ఈ స్థాయి కారణం ఒక రోజు పడిన కష్టం కాదు.. దాని కోసం దిల్ రాజు చాలానే మెట్లు ఎదగాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలవుతుంది ...

Read More »

జయప్రదను వెంటనే అరెస్ట్ చేయండి: ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదను సమస్యలు చుట్టుముట్టాయి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా యూపీలోని రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆ సమయంలో ఆమెపై అక్కడ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరిగింది. అయితే కోర్టుకు హాజరు కావాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో, గతంలో ఒకసారి ఆమెకు ...

Read More »

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ ధన దాహానికి బలైంది..!

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నుంచి బస్సులో మేడిగడ్డకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.97వేల కోట్ల వ్యయం చేసి కనీసం 97 వేల ఎకరాలకు నీరు ఇవ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలిపోయి నెలలు గడుస్తున్నప్పటికీ నోరు ...

Read More »

షర్మిలకు ఆ ఒక్క గుర్తింపు తప్ప మరేమీ లేదు: రోజా

ఏపీలో టైమ్ పాస్ రాజకీయాలు చేయడానికి వచ్చిందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని… అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ ను వీరు రంగంలోకి దించారని చెప్పారు. ఇప్పడు పవన్ కల్యాణ్ మాటలు కూడా వివి విని బోర్ కొట్టడంతో షర్మిలను రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు. షర్మిల మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చంద్రబాబు స్క్రిప్టేనని అన్నారు. చంద్రబాబు కోవర్ట్ రేవంత్ రెడ్డితో షర్మిల ...

Read More »

వీరి ప్రేమ కథతో ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నా కొత్తజంట …

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సినిమా సమయంలో ఏర్పడ్డ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. గతేడాది నవంబర్‌లో వీరు గ్రాండ్‌గా ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. టాలీవుడ్‌ స్టార్స్ లో ప్రత్యేకంగా చెప్పుకునే మ్యారేజెస్‌లో వరుణ్‌-లావణ్యల పెళ్లి ప్రముఖంగా నిలుస్తుందని చెప్పొచ్చు. అయితే వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి ఓ క్రేజీ సీక్రెట్‌ని బయటపెట్టింది లావణ్య త్రిపాఠి. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్‌ లో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఇందులో హేబా పటేల్‌ ...

Read More »

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మంచిదే.. మంత్రి పెద్దిరెడ్డి

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం.. కృష్ణా జలాల వివాదం పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరికొన్నాళ్లు ఉంటే మంచిదే అన్నారు. రాష్ట్రానికి తాము ఎక్కువ కృష్ణా జలాలు తీసుకొచ్చామని.. ఇదే విషయాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని విపక్షాలు అర్థం చేసుకోవాలని సూచించారు. రాయలసీమ జిల్లాల సిద్దం సభ ఈ నెల 18 న రాప్తాడులో నిర్వహిస్తాం. భారీగా పార్టీ క్యాడర్, ...

Read More »

సీఎం జగన్ ని కలిసిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని

ప్రకాశం జిల్లా ఒంగోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు.

Read More »

రాప్తాడు ‘సిద్ధం’ సభ వాయిదా: పెద్దిరెడ్డి

ఈ నెల 11న రాప్తాడులో జరగాల్సిన ‘సిద్ధం’ సభ వాయిదా పడినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సభను ఈ నెల 18న నిర్వహిస్తామని ప్రకటించారు. ‘చంద్రబాబు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. ఎంతమందితో కలిసివచ్చినా వైసీపీదే విజయం. వలంటీర్లపై ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోంది. కరోనా సమయంలో వారి సేవలు మరువలేనివి’ అని ఆయన పేర్కొన్నారు.

Read More »