Politics

తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై CEO వికాస్ రాజ్ కీలక ప్రకటన

దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుండి ప్రారంభంకానున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్.. ఈసారి మొత్తం ఏడు దశల్లో జరగనుంది. మే 13న నాలుగవ దశలో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాజ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పోలింగ్‌కు రాష్ట్రంలో 90 వేల పోలింగ్ ...

Read More »

ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయన ఈ రోజు ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ముంబైలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.

Read More »

తెలంగాణకు గవర్నర్‌గా రాబోతోంది ఎవరో తెలుసా?

లోకస‌భ ఎన్నికల వేళ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పంపించారు. అదేవిధంగా పుదుచ్చేది లెఫ్ట్‌నెంటర్ గవర్నర్ పదవికి కూడా రాజీనామాను సమర్పించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా ఎవరు రాబోతున్నారనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తు్న్న దృష్ట్యా కొత్త గవర్నర్ నియామకం ప్రస్తుతం లేనట్లుగనే తెలుస్తోంది. దీంతో మరో ...

Read More »

టీడీపీకి బిగ్ షాక్..వైసీపీలోకి బండారు సత్యనారాయణ ?

తెలుగు దేశం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలేలా కనిపిస్తోంది. వైసీపీ పార్టీలోకి సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ రానున్నారట. పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ వైసీపీతో టచ్ లో ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇంకా ప్రకటించని అనకాపల్లి ఎంపీ సీటును బండారుకు వైసీపీ ఆఫర్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు వైసీపీ పెద్దలతో సీనియర్ టీడీపీ నేత బండారు సత్యనారాయణ టచ్‌ లో ఉన్నారట. అన్ని ఒకే అయితే.. వైసీపీలోకి దూకేస్తారట సీనియర్ టీడీపీ నేత ...

Read More »

ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర…అక్కడి నుంచే ప్రారంభం

సీఎం జగన్ ఎన్నికల ప్రచారంపై కీలక అప్డేట్‌ వచ్చేసింది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన సీఎం జగన్….ఈ నెల 27 నుంచి బస్సుయాత్ర ప్రారంభిస్తారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు జగన్ బస్సుయాత్ర చేస్తారు. 20 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది.

Read More »

ఎలక్టోరల్ బాండ్లపై ఎస్‌బీఐకి కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు మరోమారు కీలక ఆదేశాలు జారీచేసింది. ఆయా రాజకీయ పార్టీలకు వ్యక్తులు, కంపెనీలు విరాళాలు ఇచ్చేందుకు అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలన్నింటినీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ)ను ఆదేశించింది. అంతేకాదు, ప్రతి బాండ్ క్రమసంఖ్య కూడా అందులో పేర్కొనాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

Read More »

ఏపీ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు

ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చిలకలూరిపేట సభలో విమర్శలు చేశారు. ‘రాష్ట్ర మంత్రులు అవినీతి, అక్రమాల్లో పోటీ పడుతున్నారు. ఒకరికి మించి ఒకరు అవినీతి చేస్తున్నారు. కాంగ్రెస్, వైసీపీ వేర్వేరు కాదు. ఈ రెండూ కుటుంబ పార్టీలే. YCPని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. YCP అవినీతితో APలో గత ఐదేళ్లు అభివృద్ధి జరగలేదు. రాబోయే 5 ఏళ్లు APకి కీలకం. ఎన్నికల్లో ఓటు చీలకుండా NDAను గెలిపించాలి’ అని కోరారు.

Read More »

పసుపు ధరపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

పసుపు ధరపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో బీజేపీ తలపెట్టిన విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. తాము రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించామని తెలిపారు. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. పసుపు ధరను క్వింటాల్ కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు పెంచామన్నారు. ఇక్కడి ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్ల తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేస్తామన్నారు. తెలంగాణలో రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో ...

Read More »

టిప్పర్ డ్రైవర్కు YCP ఎమ్మెల్యే టికెట్

శింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుకు పార్టీ టికెట్ కేటాయించింది. ఈయన దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. అలాగే మడకశిర అభ్యర్థి ఈర లక్కప్ప ఉపాధి కూలీ. ఆయన ఇప్పటికీ పక్కా గృహంలో నివసిస్తున్నారు. మరోవైపు మైలవరం అభ్యర్థిగా ప్రకటించిన సర్నాల తిరుపతిరావు సామాన్య రైతు. 2021లో జడ్పీటీసీగా గెలుపొందారు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు.

Read More »

లోక్ సభ బరిలో తమిళిసై!

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. సోమవారం ఉదయం తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈమేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తమిళిసై రాజీనామా సంచలనంగా మారింది. లోక్ సభ ఎన్నికల బరిలో తమిళిసై నిలబడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటిదేమీ లేదని గతంలో తేల్చిచెప్పిన తమిళిసై.. ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేయడంతో లోక్ సభ ...

Read More »