Politics

రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

నెల రోజులుగా ఎండలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు కొద్ది రోజులుగా కాస్త ఉపశమనం కలుగుతుంది. రాష్ట్రంలోని పలు చోట్ల శనివారం, ఆదివారం వర్షాలు కురిశాయి. అలాగే మరో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని.. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ఈ రోజు హన్మకొండ, హైదరాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల ...

Read More »

కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. దీంతో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ఈనెల 16నే విచారణ జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండటంతో నేటికి వాయిదా పడింది. మ.2 గం.కు వాదనలు ప్రారంభం కానున్నాయి. అటు కవిత ఈడీ, సీబీఐ జుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఆమెను మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

Read More »

అభ్యర్థుల ప్రకటన ఇంకెప్పుడు?

లోక్సభ నామినేషన్ల గడువు 25న ముగియనుంది. ఇప్పటికే BRS, BJP అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి. కానీ అధికార కాంగ్రెస్ మాత్రం మరో 3 స్థానాల్లో క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. HYD, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. పలుమార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లొచ్చినా ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారమెలా చేయాలని కార్యకర్తలు అంటున్నారు.

Read More »

నేను సీబీఐ విచారణకు సిద్ధం.. నువ్వు రెడీనా చంద్రబాబూ?: కాకాణి

తాను సహజ వనరులను దోచేశానంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘ఆ అభియోగాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు నేను సిద్ధం. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరే ధైర్యం ఆయనకు ఉందా? సర్వేపల్లిలో జరిగిన అభివృద్ధి చూపిస్తాను రండి. ఈ ప్రాంతానికి ఏం చేశారో చంద్రబాబు చెప్పుకోలేక నాపై విమర్శలు చేసి వెళ్లిపోయారు’ అని మండిపడ్డారు.

Read More »

ప్రపంచం తలకిందులైనా రుణమాఫీ చేసి తీరుతాం: CM

ప్రపంచం తలకిందులైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా రుణమాఫీ ఆగదు. అది పూర్తి చేసి రైతుల రుణం తీర్చుకుంటాం’ అని తెలిపారు. ఏపీలో నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా మోదీ ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.

Read More »

సీఎం జగన్ పై రాళ్ల దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్!

సీఎం జగన్ కు మరో షాక్‌ తగిలింది. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిపై రాళ్ల దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారట కొంత మంది దుండగులు. సీఎం జగన్ పై రాళ్ల దాడి చేస్తామంటూ ఆకతాయిలు 1902 హెల్ప్ లైన్ నంబరుకు ఫోన్ చేసి బెదిరించారని సమాచారం అందుతోంది. దీంతో ఏపీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం జగన్‌ ఆదివారం విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో రాళ్ల దాడి చేస్తామని ...

Read More »

కాసేపట్లో ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్స్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేస్తారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి కాకుండా… సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ఫలితాలను విడుదల చేయబోతున్నారు. మార్చి 18 నుంచి 30 వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,473 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రైవేటుగా ...

Read More »

జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్.. మేనిఫెస్టోపై జగన్ ప్రత్యేక దృష్టి

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ ఈరోజు బ్రేక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై ఈరోజు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆకర్షించడం తదితర అంశాలపై వ్యూహరచన చేయనున్నారు. మరోవైపు ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిని మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నారని ...

Read More »

బాబు బటన్ నొక్కితేనే పవన్ మాట్లాడతారు : సజ్జల రామకృష్ణారెడ్డి

వచ్చేనెల మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకరిపై మరొకరు రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కి ఏ కోశానా నాయకుడి లక్షణాలు లేవని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ‘చంద్రబాబు కోసమే పవన్ పుట్టి పెరిగినట్లు ఉంది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ...

Read More »

20వ రోజు “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే

20వ రోజు “మేమంతా సిద్ధం” బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. 20వ రోజు “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా…ఇవాళ గ్రేటర్ విశాఖ పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు CM జగన్. నైట్ క్యాంప్ నుంచి బయలుదేరి పినగాడి, లక్ష్మీపురం మీదుగా వేగుంట చేరుకోనుంది సీఎం జగన్‌ బస్సు యాత్ర. ఇక భోజనం విరామం తర్వాత కోర్ సిటీలో యాత్ర కొనసాగిస్తారు సీఎం జగన్‌. NAD, కంచర పాలెం, రైల్వే న్యూ కాలనీ, గురుద్వారా , వేంకోజీ పాలెం మీదుగా సాగనుంది ...

Read More »