Politics

నేడు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ !

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 8 స్థానాలకు సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనుంది కాంగ్రెస్ పార్టీ. అయితే.. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భువనగిరి స్థానాలు పెండింగ్ లో పెట్టనుంది కాంగ్రెస్‌ పార్టీ. ఆ స్థానాల్లో ఆశావహులు ఎక్కువ ఉన్నందున అభ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో ఆలస్యం కానుంది. ఇది ఇలా ఉండగా… నాగర్ కర్నూల్ లోకసభ టిక్కెట్ మాదిగలకు ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ నియోజకవర్గంలో మాదిగ ఓట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ...

Read More »

అక్కడి నుంచే కేసీఆర్ పోటీ!

మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ టికెట్‌ను ప్రకటించినప్పటికీ, మెదక్‌ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్‌ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్‌పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్‌ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు ...

Read More »

చంద్రబాబు జీవితంలో మంచి రోజులు అయిపోయాయి: విజయసాయిరెడ్డి

టీడీడీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబులాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. ఆయన జీవితంలో మంచి రోజులు అయిపోయాయని… తన కొడుకు లోకేశ్ ని ప్రమోట్ చేయడం, రిటైర్మెంట్ జీవితం కోసం డబ్బులు సంపాదించడమే ఇప్పుడు ఆయన ఏకైక అజెండా అని అన్నారు. తన ఆకాంక్షలే చచ్చిపోతే ఏపీ ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరని ప్రశ్నించారు. ఏపీకి విధానపరమైన కొనసాగింపును తీసుకురాగల స్థిరమైన యువ నాయకుడు కావాలని ...

Read More »

కడప నేతలతో నేడు షర్మిల భేటీ.. కీలక ప్రకటన వెలువడే అవకాశం!

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సమావేశం జరగబోతోంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు, తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కడప ...

Read More »

లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత కు షాక్ ఇచ్చిన కోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి అరెస్టు కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయి.. ఈడీ కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో తనని ఈడీ అధికారులు అక్రమంగా అరెస్ట్ చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన కోర్టు.. కవిత వాదనను కొట్టివేసింది. పీఎమ్ఎల్ఏ చట్టంలో సెక్షన్-19ను ఈడీ ...

Read More »

శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో బొజ్జల సుధీర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు సీటు కేటాయించారు. అయితే బొజ్జల సుధీర్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వ్యతిరేకిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో తాను బలంగా ఉన్నానని చెబుతున్నారు. అవసరమైతే తనపై సర్వేలు చేసుకోవాలని సూచిస్తున్నారు. సర్వేకు అయ్యే ఖర్చు మొత్తం తాను భరిస్తానంటూ చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకాళహస్తి సీటు తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ...

Read More »

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ రాధాకృష్ణన్ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామివారిని, పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం ఆయన తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌కు అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు.

Read More »

బీఆర్ఎస్‌కు మరో పార్టీ కీలక నేత రాజీనామా… త్వరలో కాంగ్రెస్‌లో చేరిక

బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ శాసన మండలి సభ్యుడు పురాణం సతీష్ కుమార్ కారు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ అధినేతకు తన రాజీనామా లేఖను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ పేరుతో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్‌గా మార్చి తప్పు చేశారన్నారు. ఇలా పేరు మార్చడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు.

Read More »

పవన్ తప్పుకుంటే సీటు నాదే..పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన పిఠాపురంలో పవన్ పోటీ రోజుకో మలుపు తిరుగుతోంది. కాకినాడ ఎంపీగా పిఠాపురం జనసేన ఇన్చార్జ్ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అదే సీటు ఆశిస్తున్న పిఠాపురం టీడీపీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ మరో సంచలనానికి తెర లేపారు. తాను ఎంతో కాలంగా పిఠాపురం నియోజకవర్గంతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నానని , పొత్తు విషయంలో పవన్ కి పిఠాపురం సీటు కేటాయించి తన సీటును త్యాగం చేయాలని చంద్రబాబు కోరారన్నారు. చంద్రబాబు ఆదేశం ప్రకారం ...

Read More »

తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపిస్తున్నారని సీఎస్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు

తన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపిస్తున్నారంటూ హన్మకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఫిర్యాదు చేశారు. తన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ఇతరులకు పంపిస్తున్న సదరు ఆర్డీవోపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కరువు వచ్చిందని బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉచిత ...

Read More »