Technology

సివిల్స్ ఫలితాల విడుదల.. మూడో ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. 2023 సంవత్సరానికి గాను మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ కోటాలో 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీ నుంచి 165 మంది, ఎస్టీ నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ కు 180 మంది, ...

Read More »

కాసేపట్లో ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ ఫ‌లితాలు శుక్ర‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఏపీ ఇంటర్ బోర్డు వెల్ల‌డించింది. మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేస్తామ‌ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యామండ‌లి ప్ర‌క‌టించింది. తాడేప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యా కార్యాల‌యంలో ఉద‌యం 11 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగిన విష‌యం తెలిసిందే. ఒకేష‌న‌ల్‌, రెగ్యుల‌ర్ కలిపి ఫస్టియర్ 5,17,617 మంది విద్యార్థులు, సెకండియర్ 5,35,056 మంది విద్యార్థులు పరీక్షలకు ఫీజులు చెల్లించారు. వీరిలో 9,99,698 ...

Read More »

చైనాలో దూసుకెళ్తున్న రోబో టాక్సీ! ఫ్యూచర్‌లో డ్రైవర్ జాబ్స్ ఉండవేమో?

రోబో మనుషులే కాదు.. రోబో ట్యాక్సీలు కూడా వచ్చేశాయి. రోబో టాక్సీలు డ్రైవర్ అవసరం లేకుండా ప్రయాణికులు కోరుకున్న గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యాప్ ఆధారంగా పనిచేసే రోబో టాక్సీలు చైనాలో దూసుకెళ్తున్నాయి. గతంలోనే రోబో ట్యాక్సీల పేరుతో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలను బీజింగ్‌లో చైనా ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పుడు అవి కొన్ని రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా రోబో టాక్సీలను కొన్ని దేశాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. కాలిఫోర్నియాలో ...

Read More »

షాకింగ్ ఘటన.. చెట్టు నుంచి ఉప్పొంగి వస్తున్న నీళ్లు..

నార్మల్‌గా చెట్టు నీటిని గ్రహించి ఏపుగా పెరుగుతుంది. అయితే పాపికొండల నేషనల్ కింటుకూరు ఫారెస్ట్‌లో ఓ షాకింగ్ ఘటన జరింగింది. అటవీ ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం వెలుగులోకి వచ్చింది. కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులు నల్ల మద్ది చెట్టును నరకుతుండగా సుమారు 20 లీటర్ల వరకు నీరు ఉబికి వచ్చింది. ప్రెషర్‌గా నీళ్లు రావడాన్ని చూసి అక్కడే ఉన్న అధికారులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More »

డెవిల్ పక్షి గురించి మీకు తెలుసా…?

డెవిల్ పక్షి పేరు మీరు వినే ఉంటారు. ఇది చాలా అరుదైన పక్షుల్లో ఒకటి. అయితే, ఈ పక్షి అడల్ట్ అన్హింగాలు చాలా పెద్దవి… ఇంతే కాదు పొడవాటి సన్నని మెడ, తోక మరియు రెక్కలపై వెండి పాచెస్‌తో ఉంటాయి. వీటిలో మగ డెవిల్ పక్షులు ఒకలా, ఆడ పక్షులు ఒకలా ఉంటాయి. మగ డెవిల్ పక్షులకు ఒక విశిష్టత కలిగి ఉంటాయి. అవి మొత్తం ఆకుపచ్చ-నలుపు ఈకలను కలిగి… ఎగువ వెనుక భాగంలో వెండి-బూడిద ఈకలు మరియు పొడవాటి తెల్లటి ప్లూమ్‌లతో రెక్కలు ...

Read More »

నేడు ఎడెక్స్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించనున్న సీఎం జగన్

విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం కల్పిస్తోంది జగనన్న సంక్షేమ ప్రభుత్వం. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ఎడెక్స్‌ తో ఒప్పందం చేసుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. హార్వర్డ్, ఎంఐటీ, లండన్‌ స్కూ­ల్‌ ఆఫ్‌ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్, ఇంపీరియల్‌ కాలేజ్‌ ...

Read More »

త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

గ్రూప్-1, 2 పోస్టుల భర్తీ చేపడుతున్న APPSC.. త్వరలోనే 861 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆర్థిక శాఖ అనుమతించడంతో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, 10 తానాదార్లు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో కలిపి మొత్తం 861 పోస్టులకు వారంలో ప్రకటన ఇవ్వనుంది.

Read More »

27 ఏళ్ల యువకుడి సంచలనం.. 90 రోజుల్లో 9800 కోట్లు సాధించాడు..

ఒక చిన్న ఐడియా ఎంతోమందిని కూడా బిలినియర్స్ గా చేస్తుంది. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది, ఒకే ఒక చిన్న ఐడియా చిన్న వయసులోనే అత్యుత్తమ స్థాయికి కూడా తీసుకు వెళుతుంది. చిన్న పెట్టుబడి ఎంతోమందిని ఇప్పటికే కోటేశ్వరరావు చేసిన సంఘటనలు చూసాం. అలా మనకు భారతదేశంలో వందలాది బిలినియర్స్కి నిలియంగా మారినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అయితే ఇందులో చాలా చిన్న వయసులోనే బిలినియర్స్ గా మారినటువంటి కొంతమంది, యువకుల స్టోరీస్ కూడా అనేకం చేసాం. ఇప్పటివరకు అయితే తాజాగా 20 ఏళ్ల యువకుడు సాధించినటువంటి ...

Read More »

కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న హీరో….

సెలబ్రిటీలు ఏంచేసినా అది వైరల్ అయిపోతుంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కారు టైర్లకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. బన్నీ తన కారు టైర్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారన్నదే ఆ వార్త. ఆ టైర్లపై తన సంతకం వచ్చేలా డిజైన్ చేయించుకున్నారట. కారు టైర్లపై స్టాప్ మార్క్ సిగ్నేచర్ ‘ఏఏ’మార్కు వేయించినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ తన బిజినెస్ వ్యవహారాల్లో ఇదే సంతకం పెడుతుంటారు. ప్రస్తుతం ఇదే ఆయన లోగోగా మారింది. ఇప్పుడీ కారు, ఆ ...

Read More »

ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు: వాతావరణ శాఖ

ఈ ఏడాది వర్షాకాలంలో వానలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్నినో బలహీనపడుతుండటంతో ఆగష్టు నాటికి లానినా ఏర్పడి వర్షాలు బాగా కురుస్తాయని వివరించింది. గత ఏడాది ఎలినినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈసారి మాత్రం నైరుతి సీజన్లో మెరుగైన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే సమ్మర్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువే ఉంటుందని తేల్చిచెప్పింది.

Read More »