Spirituality

తిరుమల శ్రీవారి ఆలయం ఎవరు నిర్మించారో తెలుసా

ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం సామ్రాజ్యానికి అధిపతి తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు. ”భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మనమధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకో దలచాను. కలియుగం అంతమయ్యే వరకు వేంకటేశ్వరుని అవతారంలో కొండమీదే ఉంటాను. కనుక నువ్వు నాకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. ...

Read More »

శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్తోత్రం పారాయణం చేస్తే సంపద !

శ్రావణమాసం.. చివరి శుక్రవారం. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు. అందులోనూ శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం ప్రాప్తి. కావల్సిందల్లా భక్తి, శ్రద్ధ. అమ్మవారిని ప్రాతఃకాలంలో, సాయంకాలంలో కింది స్తోత్రంతో పారాయణం చేయండి. తప్పక విశేష లాభాలు కలుగుతాయి. ఆ శ్లోకం వివరాలు. నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 1 ‖ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 2 ‖ సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |సర్వదుఃఖ హరే ...

Read More »

వినాయక చవితి వ్రతం.. వినాయక కథ, పూజా విధానం

వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికి వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి. శ్లోకం: ‘ఓం ...

Read More »

కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్.. భక్తులకు అనుమతి లేదు

తెలంగాణలో వినాయక చవితి వేడుకలంటే అందరి దృష్టి ఖైరతాబాద్ గణపతిపైనే. ప్రతీ ఏటా ఇక్కడ అతి పెద్ద విగ్రహం కొలువు తీరుతోంది. ప్రతీ ఏటా వేలాది భక్తుల పూజలు అందుకుంటాడు ఇక్కడ బొజ్జ గణపయ్య. ఈసారి ఖైరతాబాద్‌లోని గణపయ్య ధన్వంతరి నారాయణుడిగా భక్తులకు దర్శనిమస్తున్నాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి విగ్రహం నిర్మాణాన్ని కేవలం 9 అడుగులకే పరిమితం చేశారు. కొవిడ్‌ మహమ్మారికి ఔషధం తెచ్చే ధన్వంతరి నారాయణ గణపతిగా స్వామి దర్శనమిస్తున్నారు. చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో ఉన్న వినాయకుడికి కుడివైపున ...

Read More »

ధనం, ఆనందం కోసం తెల్ల అన్నంతో ఇలా ఆరాధిస్తే మంచి ఫ‌లితం..

ధనం మూలం ఇదం జగత్. అదే సమయంలో ధనంతోపాటు ఆనందంగా ఉండాలి అని కోరకుంటారు ప్రతి ఒక్కరు. జీవితానికి ధనం అదేనండి ఐశ్వర్యం, ఆనందం రెండు ముఖ్యమే. దీనికోసం పెద్దలు అనేక పరిష్కారాలు చెప్పారు వాటిలో కొన్ని తెలుసుకుందాం.. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు ...

Read More »

వరలక్ష్మి వ్రత కథ

ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, “ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు”డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, “దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను” అనెను. అది విని యామె, “స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ”య వేడెను. ,, “ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద” ననెను. అంతట పరమేశ్వరుడు “ఓ పడతీ! ఆ వ్రతకథను చెప్పెదను ...

Read More »

వరలక్ష్మి వ్రతం రోజు ఎందుకు ఈ వ్రతం చేస్తారో తెలుసా

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! ...

Read More »

వరలక్ష్మీ వ్రతం పూజా సమయం

చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. అంతే కాదు ఈ మాసంలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తికి భార్య. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది. ...

Read More »

వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం.. పాటించాల్సిన నియమాలు

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి ...

Read More »

శ్రావణ సోమవారాలు శివారాధనకు విశేష రోజులు !

శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. శ్రావణంలో వచ్చే సోమవారాలు శివారాధనకు విశేషమైనవిగా పరిగణించపబడతాయి. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యా ర్థాం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ...

Read More »