Spirituality

ప్రతి ఏటా శివరాత్రి శివాలయంలో నాగుపాము దర్శనం..

నిర్మల్ జిల్లాలోని దస్తురాబాద్ మండలం గొడిసెరాల రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గర్భగుడిలో నాగుపాము దర్శనం ఇచ్చింది.మహా శివరాత్రి పండగను హిందువులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దేశంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. శివాలయాలు శివ నామస్మరణ తో మారుమ్రోగాయి. శివయ్య భక్తులే కాదు నేను కూడా అంటూ మహా శివరాత్రి రోజున శివయ్యను పూజించడానికి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం అయింది. భోలాశంకరుడిని, నాగు పాముని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ...

Read More »

శివలింగంపై నిత్యం జలధార..

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి ఆలయం జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎండోమెంట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండు గుట్టల నడుమ కొలువైన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ...

Read More »

శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు..

ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. 4 వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లి కార్జునస్వామి మయూర వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం విద్యుత్ దీపకాంతులతో భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులు విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా ఉంది. ...

Read More »

ఓంకారం మంత్రం కాదు.. ఒక ఆరోగ్య మహత్యం..

మనలో చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. ఆనందం కోసం శబ్ద రూపంలో సంగీతాన్ని ఆస్వాదిస్తుంటారు. పంచభూతాల్లో శబ్దం ఎప్పట్నుంచో ఉందని పండితులు చెబుతారు. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్రతి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, దేహం పులకిరించిపోతుంది. ‘ఓం’ అన్నది మంత్రం కాదు.. మత సంబంధమైనది అసలే కాదు.. వేదాల్లో నిక్షిప్తమైన ఓంకార నాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో రుషులు వాతావరణ పరిస్థితులను తట్టుకుని ...

Read More »

రేపే విజయ ఏకాదశి..

హిందూ మతంలో ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మార్చి 6న విజయ ఏకాదశి. ఈ రోజున చాలా మంది విష్ణువును పూజిస్తారు. అయితే విష్ణువును ఎలా పూజించాలి? ఎలాంటివి చేయకూడదో తెలుసుకుందాం.. విజయ ఏకాదశి నాడు ఉదయం నిద్రలేచి, స్నానం చేసి, విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈసారి విజయ ఏకాదశి బుధవారం మార్చి 6వ తేదీ ఉదయం 6:30 గంటలకు నుండి మార్చి 7వ తేదీ ఉదయం 4:30 గంటల వరకు ...

Read More »

మహా శివరాత్రి రోజు వీటిని ప్రసాదంగా పెట్టండి..

ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8 వ తేదీన వస్తుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహాశివరాత్రి పవిత్ర పండుగను జరుపుకుంటారు. ఈ రోజున శివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నారని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు. శివరాత్రి నాడు బిల్వపత్రం, భాంగ్, ధాతుర, మదర్ పువ్వు, తెల్ల చందనం, తెల్లని పువ్వులు, గంగాజలం, ఆవు పాలతో పూజిస్తారు. శివలింగంపై ఒక కుండ నీరు, బిల్వపత్రంను సమర్పించడం ద్వారా మహాదేవుడు సంతోషిస్తారు. వీటితో పాటు శివునికి కొన్ని ...

Read More »

సకల దేవతలను ఆహ్వానిస్తూ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు…

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాలకు మహాశివరాత్రి స్పెషల్ ఆఫీసర్ , దేవస్థానం ఈవో, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్ర వారం సాయంత్రం ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజ పటావిస్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా ఉత్సవ నిర్వాహకుడైన చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ధ్వజస్దంభం ...

Read More »

హోలీరోజున ఈ వస్తువులు ఇంటికి తీసుకువస్తున్నరా..

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే హోలీ పండుగ ఆనందంతో నిండి ఉంటుంది. హోలికా పూజ, హోలికా దహన్ తర్వాత ప్రజలు ఆనందంతో రంగులను చల్లుకుంటారు. హోలీ పండుగ ప్రజల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే హోలీరోజున కొన్ని వస్తువులు ఇంటికి తీసుకువస్తే ఇంట్లో ఆనందం, శాంతి కలుగుతుందట. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదట. *జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలికా దహనం..హోలీ రోజున ఇంట్లోకి వెదురు మొక్కను తీసుకురావడం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు. ...

Read More »

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు..

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నెటీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాలతో పెయింటింగ్ లతో ఆలయం ముస్తాబవుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు.శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు వసతి వైద్యం శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ...

Read More »

క్రమంగా పెరుగుతున్న మల్లన్న హుండీ ఆదాయం..

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిగా కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్నారు. తాజాగా అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 5 ,62,30,472 రూపాయల నగదు లభించింది. ఈ ఆదాయాన్ని ...

Read More »