టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు

సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ సెలబ్రేషన్స్ మార్మోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, సొషల్ మీడియాని ‘రాజకుమారుడి’ జన్మదినం ఫీవర్ పూర్తిగా పట్టేసింది. ఒకవైపు అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ హ్యాష్ ట్యాగ్ లు రన్ చేస్తోంటే మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, ఈ మధ్యలోనే ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసేసింది… ‘బ్లాస్టర్’! పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ చేస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా బర్త్ డే బ్లాస్టర్ ని విడుదల చేశారు ఫిల్మ్ మేకర్స్. హీరో మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కి స్పెషల్ విజువల్ ట్రీట్ అందించారు. సూపర్ స్టైలిష్ గా ఉన్న మహీ అంతకంటే స్టైలిష్ గా ఫైట్ చేశాడు. అదిరిపోయే డైలాగ్ చెబుతూ కిక్స్ అండ్ పంచెస్ తో యాక్షన్ చూపించాడు.