కోలివుడ్‌ ఎంట్రీ ఇస్తున్న చాందిని

ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైన ‘కలర్‌ ఫోటో’ హీరోయిన్‌ చాందినీ చౌదరి. పలు చిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ తెలుగు హీరోయిన్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘మై కడవులే, మన్మథ లీలై’ చిత్రాల హీరో అశోక్‌ సెల్వన్‌కు జంటగా నటించబోతున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ తమిళ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ద్వారా హీరో కమల్‌ హాసన్‌ శిష్యుడు సిఎస్‌.కార్తికేయన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నందుకు చాందినీ చౌదరి ఆనందం వ్యక్తం చేశారు.