వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పై టీడీపీ కార్యకర్తల దాడి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమరావతిలోని చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై జోగి రమేశ్ స్పందిస్తూ… తమ ఆరాధ్య దైవం జగన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు సిగ్గులేదని… అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేయడానికి వచ్చిన తమపై దాడి చేస్తారా? అని మండిపడ్డారు. గూండాలు, చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కలిసి దాడికి పాల్పడ్డారని అన్నారు.