‘ఛత్రపతి’ రీమేక్‌కి క్లాప్‌

యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నచిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. రాజమౌళి తెరకెక్కించిన ‘చత్రపతి‘ చిత్రానికి ఇది రీమేక్. పెన్ మ‌రుధ‌ర్ సినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ధ‌వ‌ల్ జ‌యంతిలాల్ గ‌డ‌, అక్ష‌య్ జయంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రాజ‌మౌళి, సుకుమార్‌, విజ‌యేంద్ర ప్ర‌సాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు వీవీ వినాయక్, బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత జయంతిలాల్ కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి రాజ‌మౌళి క్లాప్ కొట్ట‌గా, ర‌మా రాజ‌మౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత ఎ.ఎం.ర‌త్నం గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్క్రిప్ట్ అందించారు.