25 భాషల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌

మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగు తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది సేవలు పొందారు. కరోనా సమయంలో సైతం చిరు తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ఎంతోమందికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేషన్స్ పంపించారు. ఇప్పుడు అదే పేరు మీద చిరు ఓ వెబ్ సైట్ ను ప్రారంభించారు. మొత్తం 25 భాషల్లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఈ వెబ్ సైట్ ను లాంఛ్ చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి.