చిన్న వయసులోనే వదిలివెళ్లడం బాధాకరం: చిరంజీవి

కన్నడ సూపర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. చిన్న వయసులోనే పునీత్‌ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్‌ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్‌ అన్నారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్‌ భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన పుష్పాంజలి ఘటించారు. వీరితో పాటు శ్రీకాంత్‌, అలీ కూడా పునీత్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్‌ మరణం తీరని లోటన్న శ్రీకాంత్‌.. ఆయన కటుంబసభ్యులకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు.