ఘనంగా హీరో కార్తీకేయ పెళ్లి

ఆర్‌ఎక్స్ 100 ఫేం హీరో కార్తీకేయ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం 9:47 నిమిషాలకు హీరో కార్తీకేయ వివాహం ఘనంగా జరిగింది. కాలేజీ చదివే రోజుల్లో తాను ప్రేమించిన యువతి లోహితను పెద్దల సమక్షంలో కార్తీకేయ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత అల్లు అరవింద్  హాజరయ్యారు.  కాగా వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్‌లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా బంగారు రంగు దుస్తుల్లో, వాటికి తగ్గ జ్యూవెలరీలో మెరిసిపోయింది. వధువు లోహిత ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో బంగారు, పింక్ పట్టు చీరను కట్టుకుంది. హీరో కార్తీకేయ నటించిన ‘రాజావిక్రమార్క’ సినిమా ఇటీవల విడుదల కాగా… ప్రస్తుతం అతడు తమిళంలో అజిత్ ‘వాలిమై’లో విలన్‌గా నటిస్తున్నాడు.