మరో 10 రోజుల్లో పిఆర్‌సిని ప్రకటిస్తామని ఎపి సిఎం జగన్ శుక్రవారం పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సిఎం తిరుపతిలో పర్యటిస్తున్నారు. పలు ఉద్యోగ సంఘాలు ఆయనను కలిసి.. తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా స్పందించిన సిఎం.. పిఆర్‌సి ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజుల్లో ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.
