మదనపల్లిలో చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. మంగళవారం మదనపల్లిలో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగా సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే టీడీపీ ఇంటింటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని చెబుతోంది.. టీడీపీ చరిత్ర అంతా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలోని హామీలను తుంగలో తొక్కి.. ఇప్పుడు సూపర్-6, సూపర్-7 అంటూ పేదల రక్తాన్నీ పీల్చేందుకు పసుపుపతి (చంద్రబాబు) మళ్లీ వస్తున్నాడని ఎద్దేవా చేశారు. మరోసారి మోసం చేయడానికి వస్తున్న పసుపుపతిని ప్రజలెవరూ నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని మరోసారి దోచుకోవడం కోసమే చంద్రబాబుకు అధికారం కావాలని ఫైర్ అయ్యారు. నమ్మిన వారిని నట్టేట ముంచడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని సెటైర్ వేశారు.