జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్), గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్‌పై అవగాహన కల్పించాలని.. ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుందో చెబుతూ, వారికి అవగాహన కలిగించాలని సీఎం ఆదేశించారు. ఓటీఎస్ పథకం పురోగతిపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. 22-ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని అధికారులు తెలిపారు. ఓటీఎస్ వినియోగించుకున్నవారికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఫీజులను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఓటీఎస్ వినియోగించుకున్నవారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఫీల్డ్‌స్కెచ్, లోన్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇస్తున్నామని తెలిపారు.
