కరోనా వైరస్ సోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి అంతిమ సంస్కారాలు అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్‌ను ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ ఘటన అమానవీయమని.. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిపై ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మన వాళ్లు ఉంటే ఎలా స్పందిస్తామో.. ఇతరులు ఉన్నప్పుడు కూడా అలాగే స్పందించాలని కోరారు.

కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష