రేపు విశాఖలో సిఎం జగన్‌ పర్యటన

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి శ్రీశారదా పీఠం చేరుకుంటారు సీఎం. ఆ తర్వాత శ్రీశారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లికి తిరుగుపయనం అవుతారు సీఎం జగన్.