రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సీఎం జగన్ రేపు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ పోటీల ఫైనల్ మ్యాచ్ ను వీక్షించనున్నారు. అనంతరం, ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సవాల్లో పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బహుమతుల ప్రదానం అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.