కేంద్ర విదేశాంగ మంత్రికి జగన్ లేఖ

బహ్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. బహ్రెయిన్ లో ఏపీకి చెందిన అత్యధిక మంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే అక్కడి కంపెనీలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, త్వరగా కంపెనీలు వారిని స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.