అంగరంగ వైభవంగా సీఎం రమేష్ కొడుకు పెళ్లి

అంగరంగ వైభవంగా సీఎం రమేష్ కొడుకు పెళ్లి

తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ సోదరుడు తాళ్లూరి రాజా శ్రీకృష్ణ కుమార్తె పూజ, రాజ్యసభ సభ్యుడు సీ.ఎం. రమేశ్ కుమారుడు రిత్విక్‌ల వివాహం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఈ వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి భారత ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, కేవీపీ రామచంద్రరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మురళీమోహన్,  మైసూరారెడ్డి, వేమూరు రాధాకృష్ణ, కోమటి జయరాం, వేమన సతీష్, గరికపాటి మోహనరావు, డా.లకిరెడ్డి హనిమిరెడ్డి,  పద్మశ్రీ, మన్నే సత్యనారాయణ, పెద్దిబోయిన జోగేశ్వరరావు, జొన్నవిత్తుల, శంకరమంచి రఘుశర్మ, ఉండవల్లి అరుణ్‌కుమార్, అంబికా కృష్ణ,  తదితరులు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు.