వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన జగన్

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. గురువారం ఉదయం  వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న జగన్‌కు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేస్, అనిల్‌ కుమార్ యాదవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ఘటనస్వాగతం పలికారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని ప్రత్యేక వాహనం ద్వారా టన్నెల్ లోపలకు వెళ్లి అక్కడి పనులను సీఎం జనగ్ పరిశీలించారు.