జూన్‌ 2023 నాటికి సమగ్ర భూ సర్వే పూర్తి కావాలి: జగన్

జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని, లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధంగా సర్వే సాగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. శాశ్వత భూహక్కు-భూరక్షపై ఆయన గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలన్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తీసుకోవాలని తెలిపారు. సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వే త్వరగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదని సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు.