నేడు విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

విశాఖకు నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. నేడు ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే…విశాఖకు నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ సంఘటన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆడుదాం – ఆంధ్రా ఫైనల్స్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అదజేయనున్నారు సీఎం జగన్‌. PM పాలెం క్రికెట్ స్టేడియంలో ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేసింది ACA. ఇవాళ సాయంత్రం 5.45 గంటలకు మధురవాడ హిల్ నెంబర్ 3కి హెలిప్యాడ్ కు సీఎం జగన్‌ చేరుకుంటారు. సాయంత్రం 6.00 గంటలకు PM పాలెం స్టేడియం లో క్రికెట్ అభిమానులను కలుసుకుని, క్రీడాకారులను అభినందనలు తెలుపుతారు సీఎం జగన్. ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్ క్రికెట్ వీక్షించడంతో పాటు కొంత సేపు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇక ఇవాళ రాత్రి 8.35 నిముషాలకు విశాఖ పట్నం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి.