తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పలు సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ఒక వైపు రాష్ట్రం అంతా కూడా మహమ్మారి కరోనా కారణంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్న తరుణంలో, సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం కనకవర్షం లో మునిగి తేలుతుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా కేసీఆర్ తమ కుటుంబ సభ్యులకే అధికారాలు, వ్యాపారాలు అప్పగిస్తున్నారని, పాకాల రాజేంద్రప్రసాద్ డైరెక్టర్‌గా చేరిన రాక్సెస్ లైఫ్ సైన్స్‌కి కొద్ది రోజులకే వందల కోట్లు వచ్చాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు.
