మూడో దశలో పిల్లపై తీవ్ర ప్రభావం

కోవిడ్‌ మొదటి దశ కంటే రెండో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపింది. ఇక మూడో దశలో.. మరింత ఎక్కువగా ప్రభావం చూపనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో దశలో పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కాలేజీ పీడియాట్రిక్స్‌ విభాగం డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. మహమ్మారి వల్ల.. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై దాదాపు సంవత్సరం నుంచే ఆ ప్రభావం పడిందని, థర్డ్‌వేవ్‌ వస్తే… ఈ పిల్లలపై మళ్లీ వైరస్‌ ప్రభావం చూపనుందన్న ఊహాగానాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. వైరస్‌కి చిన్నా, పెద్దా అనే తేడా లేదని, అందరిపైనా ఆ ప్రభావం పడనుందని ఆయన హెచ్చరించారు.