అమెరికాలో కరోనా విశ్వరూపం

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విశ్వరూపం దాల్చింది. మహమ్మారి తీవ్రతతో అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వైద్య నిపుణుల వివరాల ప్రకారం … అమెరికాలో ఒకే రోజు 14,49,005 మందికి వైరస్‌ సోకింది. వారం రోజుల సగటును పరిశీలిస్తే.. అమెరికాలో ప్రతీ సెకన్‌కు 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 21,041,50 మంది వైరస్‌ బారినపడ్డారు. 4,608 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో.. మొత్తం కేసులు 311,019,858, మరణాలు 5,511,955 కు చేరాయి.